Drug case | నార్సింగి డ్రగ్స్ కేసులో కీలక మలుపు … 30 మంది ప్రముఖులకు నోటీస్ లు
నార్సింగ్ డ్రగ్ కేసులో పోలీసులు ధర్యాప్తు ముమ్మరం చేశారు. తీగ లాగితే డొంక కదలినట్లు విచారణలో మరో 30 మంది ప్రముఖులు ఉన్నట్లు గుర్తించారు. త్వరలో వారిని అదుపులోకి తీసుకోనున్నట్ల తెలుస్తోంది.

విధాత: నార్సింగ్ డ్రగ్ కేసులో పోలీసులు ధర్యాప్తు ముమ్మరం చేశారు. తీగ లాగితే డొంక కదలినట్లు విచారణలో మరో 30 మంది ప్రముఖులు ఉన్నట్లు గుర్తించారు. త్వరలో వారిని అదుపులోకి తీసుకోనున్నట్ల తెలుస్తోంది. ఈ మేరకు పక్కా ఆదారాల సేకరణకు నార్సింగ్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్స్ తో సంబంధం ఉందని భావిస్తున్న 30 మంది ప్రముఖులకు పోలీసులు ఇప్సటికే నోటీస్ లు ఇచ్చినట్లు సమాచారం. ఈ కేసులు పోలీసులు ఇప్పటికే 20 మందిని నిందితులుగా చేర్చిన విషయం తెలిసిందే. నిందితుల్లో ప్రముఖ నటులు, వ్యాపారవేత్తలు, బడా బాబులున్నారు. డ్రగ్ కేసులో ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ కూడా ఉన్నారు.