రైతుల కోసం హమాలీలకు రూ.10లక్షల 20వేల ఆర్థిక సహాయం: రాజగోపాల్ రెడ్డి

ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు లేకుండా హమాలీలకు రూ.10.20 లక్షలు సొంతంగా ఇస్తానని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు.

రైతుల కోసం హమాలీలకు రూ.10లక్షల 20వేల ఆర్థిక సహాయం: రాజగోపాల్ రెడ్డి

మునుగోడు నియోజకవర్గంలో ధాన్యం కోనుగోలులో రైతుల సమస్యల పరిష్కారానికి. లారీల కొరత, హమాలీల ఇబ్బందులను అదిగమించేందుకు తక్షిణ సహాయంగా హమాలీలకు ప్రభుత్వం ఇచ్చే కూలీకి అదనంగా రూ.10,20,000 సొంతంగా చెల్లిస్తానని స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి హామీ అధికారులకు హామీ ఇచ్చారు. పది రోజుల్లో కల్లాలలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తిచేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ధాన్యం కోనుగోలు ప్రక్రియపై నల్గొండ, యాదాద్రి జిల్లాల అదికారుల సమీక్షా సమావేశంలో కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి మాట్లాడారు.

నియోజకవర్గ వ్యాప్తంగా వచ్చిన ధాన్యం దిగుబడికి, నిల్వ చేసే సామర్థ్యానికి మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉందని, మునుగోడులో 2 లక్షలు, నాంపల్లి లో 1 లక్ష, నారాయణ్ పూర్ లో 2 లక్షలు, చౌటుప్పల్ లో 4 లక్షల క్వింటాళ్ల చొప్పున 9 లక్షల క్వింటాళ్ల దాన్యం నిలువ చేసే గోదాముల నిర్మాణాలకు అంచనాలు రూపొందించాలని అదికారులకు ఆదేశించారు.

ఈ సమీక్షా సమావేశంలో నల్గొండ అడిషనల్ కలెక్టర్ రెవిన్యూ, శ్రీనివాస్, డీఆర్డీఓ నల్గొండ శేఖర్ రెడ్డి, చండూరు ఆర్డీవో శ్రీదేవి, చౌటుప్పల్ ఆర్టీఓ శేఖర్ రెడ్డి, యాదాద్రి డీసీఓ, నల్గొండ ఇన్ చార్జి డీసీఓ, సివిల్ సప్లై అదికారులు , అన్ని మండలాల ఎమ్మార్వొలు, వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ అదికారులు, ఆయా మండలాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

హైడ్రా ఆపరేషన్..కోకాపేట కొత్త చెరువులో ఆక్ర‌మ‌ణ‌ల తొల‌గింపు
Heat Wave | నిప్పుల కొలిమిలా రాష్ట్రం.. మ‌రో మూడు రోజులు మండుటెండ‌లే..!