బావ బామ్మర్ధి ఒకే కారులో
బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి టి.హరీశ్‌రావులు ఒకే కారులో ప్రయాణించిన వ్యవహారంపై సోషల్ మీడియాలో బీఆరెస్ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ర్చ సాగుతుంది

- ఐక్యత చాటే ఎత్తుగడగా విపక్షాల సెటైర్లు
విధాత : బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి టి.హరీశ్‌రావులు ఒకే కారులో ప్రయాణించిన వ్యవహారంపై సోషల్ మీడియాలో బీఆరెస్ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ర్చ సాగుతుంది. బావ బామ్మర్దులైన వారిద్దరు రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఎట్ హోంకు ఒకే కారులో వెళ్లారు. కేటీఆర్ కారు నడుపుతుండగా పక్కన హరీశ్‌రావు కుర్చుకున్నారు. ఫోటోలను హరీశ్‌రావు ట్వీట్టర్‌లో పోస్టు చేశారు. బీఆరెస్ వర్గాలు దీనిపై కదన రంగంలో కృష్ణార్జునులు..బావ బామ్మర్ధుల జర్నీ సూపర్ అంటు కామెంట్స్ పెట్టారు. ఒకడు గర్జన, ఒకడు ఉప్పెన వెరసి ప్రళయాలే..సైగ ఒకడు, సైన్యమొకడు కలిసి కదిలితే కధనమే అంటు అకాశానికెత్తారు.
మరోవైపు ఇదే ఫోటోలను ఆసరగా చేసుకుని బీఆరెస్ వ్యతిరేకులు, విపక్షాలు మాత్రం కేటీఆర్, హరీశ్‌లు తమ మధ్య ఐక్యత చాటుకునేందుకు ఇదో రకం ఎత్తుగడ ఫీట్ చేశారంటూ సెటైర్లు వేశారు. ఇటీవల అసెంబ్లీ వేదికగా ఫామ్‌హౌజ్‌లో బావబామ్మర్దులు కొట్టుకున్న బాగోతం బయట పెట్టాల్నా అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తాజాగా కామెంట్ చేశారు. ఈ నేపధ్యంలో తమ మధ్య విబేధాలు లేవని, తామంతా ఒకటేనని చాటడానికి కేటీఆర్, హరీశ్‌లు ఒకే కారులో ప్రయాణించి ట్వీట్టర్‌లో ఫోటో పోస్టు చేశారని విపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి.