రైతు రుణమాఫీ పూర్తి చేస్తాం : మంత్రి కేటీఆర్‌

రైతులకు ఇచ్చిన మాట మేరకు రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు

రైతు రుణమాఫీ పూర్తి చేస్తాం : మంత్రి కేటీఆర్‌

విధాత : రైతులకు ఇచ్చిన మాట మేరకు రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికే 23 లక్షల మంది రైతుల అకౌంట్లో 13600 కోట్లు జమ చేశామని, వచ్చే వారంలో 3 వేల కోట్లు జమ చేస్తామని, రైతులు ఎవరు ఆందోళన చందనవసరం లేదని తెలిపారు.

టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి తెలంగాణ భవన్ లో బీఆరెఎస్‌ లో చేరిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.

రైతుబంధు కింద 73 వేల కోట్లను 70 లక్షల రైతుల ఖాతాల్లో వేశామని తెలిపారు. కష్టమైనప్పటికీ రెండుసార్లు రుణమాఫీ చేశామని చెప్పారు. కరోనా కష్టకాలంలోనూ రైతు సంక్షేమము, రైతుబంధు, రుణమాఫీ , ఉచిత కరెంటు ఆగలేదన్నారు.

మూడోసారి తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సన్న బియ్యంతో మూడో పూట అన్నం పెడతామన్నారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తుందన్నారు.

ఇన్నాళ్లుగా చేయలేని వారు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయని హామీలను తెలంగాణలో చేస్తామంటు కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తుందన్నారు.