కేంద్ర గెజిట్‌పై సుప్రీంలో కేసు వేయండి
విధాత:కృష్ణానదిపై ప్రాజెక్టులకు సంబంధించి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ రాష్ట్రానికి అన్యాయం చేసే విధంగా ఉందని… దీనిపై సుప్రీంకోర్టులో కేసు వేసి స్టే తీసుకురావాలని నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. అలా చేసిన ప్పుడే కేసీఆర్ రాష్ట్రానికి న్యాయం చేసిన వారవుతార న్నారు. నల్గొండలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో వారు మాట్లాడారు. ఉత్తమ్ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల, […]

విధాత:కృష్ణానదిపై ప్రాజెక్టులకు సంబంధించి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ రాష్ట్రానికి అన్యాయం చేసే విధంగా ఉందని… దీనిపై సుప్రీంకోర్టులో కేసు వేసి స్టే తీసుకురావాలని నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. అలా చేసిన ప్పుడే కేసీఆర్ రాష్ట్రానికి న్యాయం చేసిన వారవుతార న్నారు. నల్గొండలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో వారు మాట్లాడారు. ఉత్తమ్ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల, నక్కలగండి ప్రాజె క్టులను ప్రభుత్వం రూ.80 వేల కోట్ల అంచనా వ్యయంతో నిర్మి స్తోంది. వీటిని అనుమతి పొందిన ప్రాజెక్టులుగా గెజిట్‌లో న మోదు చేయలేదు. అందువల్ల వీటికి నిధుల సమీకరణ కష్ట మవుతుంది. తద్వారా తెలంగాణ రాష్ట్రం సంక్షోభంలో కూరుకు పోతుంది. ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతలు, పోతిరెడ్డి పాడు వెడల్పు పనులు చేస్తుంటే ఈ ప్రభుత్వం నిద్రపోయింది. ఇప్పుడు హడావుడి చేస్తోంది. ఇప్పటిదాకా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను కేసీఆర్ ప్రభుత్వం పట్టిం చుకోలేదు. కేంద్ర గెజిట్ వల్ల రాష్ట్రంలోని ఉమ్మడి మహబూ బ్‌నగర్, ఉమ్మడి నల్గొండ జిల్లాలు ఎడారి అవుతాయి’’ అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.