దుబ్బాకలో మావోయిస్టు పోస్ట‌ర్ల క‌ల‌క‌లం..బీఆరెస్ నేత‌ల‌కు హెచ్చ‌రిక‌

దుబ్బాకలో మావోయిస్టు పోస్ట‌ర్ల క‌ల‌క‌లం..బీఆరెస్ నేత‌ల‌కు హెచ్చ‌రిక‌

విధాత‌: సిద్దిపేట జిల్లాకు చెందిన‌ దుబ్బాక మండ‌లంలో వెల‌సిన మావోయిస్టుపార్టీ పోస్ట‌ర్లు క‌ల‌క‌లం సృష్టించాయి. దుబ్బాక మండ‌ల కేంద్రం నుంచి దుంప‌ల‌ప‌ల్లి వార్డుకు వెళ్లే మార్గంలో క‌ల్వ‌ర్టు వ‌ద్ద ఉన్న పిల్ల‌ర్‌కు సీపీఐ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర క‌మిటీ పేరుతో పోస్ట‌ర్ అతికించి ఉన్న‌ది. ఈ పోస్ట‌ర్‌లో ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లా బీఆరెస్ నాయ‌కుల‌కు హెచ్చ‌రిక జారీ చూస్తున్న‌ట్లు ప్ర‌క‌ట‌న ఉన్న‌ది. దుబ్బాక మండ‌ల కేంద్రంలో ఈ పోస్టర్ వెలువ‌డం క‌ల‌క‌లం రేపింది. రాష్ట్రంలో న‌క్స‌లైట్లు పూర్తిగా క‌నుమ‌రుగైన స‌మ‌యంలో ఈ పోస్ట‌ర్‌వెలువ‌డం రాజ‌కీయ వ‌ర్గాల‌ను ఆందోళ‌న‌కు గురి చేస్తుంది.