నన్ను చంపడానికి కుట్ర చేస్తున్నారు
వరంగల్,ఇధాత: ముఖ్యమంత్రి కేసీఆర్ రజాకార్లను తలపిస్తున్నారని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ విమర్శించారు. హుజూరాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో ఆయన సోమవారం నుంచి ‘ప్రజా జీవన యాత్ర’ పేరుతో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్బంగా శనిగరంలో ఏర్పాటు చేసిన సభలో ఈటల మాట్లాడుతూ హుజూరాబాద్ నియోజకవర్గంలోని సర్పంచ్‌లకు సీఎం వెలకట్టారని, ఈ విషయం తనకు తెలుసునని అన్నారు. తనను చంపడానికి జిల్లా మంత్రి కుట్రలు చేస్తున్నారన్నారు. హంతక ముఠాలతో చేతులు కలిపినట్లు తనకు సమాచారం వచ్చిందన్నారు. […]

వరంగల్,ఇధాత: ముఖ్యమంత్రి కేసీఆర్ రజాకార్లను తలపిస్తున్నారని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ విమర్శించారు. హుజూరాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో ఆయన సోమవారం నుంచి ‘ప్రజా జీవన యాత్ర’ పేరుతో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్బంగా శనిగరంలో ఏర్పాటు చేసిన సభలో ఈటల మాట్లాడుతూ హుజూరాబాద్ నియోజకవర్గంలోని సర్పంచ్‌లకు సీఎం వెలకట్టారని, ఈ విషయం తనకు తెలుసునని అన్నారు. తనను చంపడానికి జిల్లా మంత్రి కుట్రలు చేస్తున్నారన్నారు. హంతక ముఠాలతో చేతులు కలిపినట్లు తనకు సమాచారం వచ్చిందన్నారు. ‘అరె కొడుకుల్లారా ఖబర్దార్..? నరహంతకుడు నయిం చంపుతా అంటేనే భయపడలేదు.. మీ చిల్లర ప్రయత్నాలకు అసలు భయపడను… ఉగ్గుపాలతో ఉద్యమాలు చేసిన వాడిని, ఈటల మల్లయ్య కొడుకుని ఆత్మగౌరవం కోసం ఏ స్థాయిలో అయినా కొట్లడతా.. దుబ్బాకలో ఎం జరిగిందో అదే ఇక్కడ కూడా జరుగుతుంది.. 2018లో నన్ను ఓడించడానికి ఎన్ని కుట్రలు చేసినా.. నా ప్రజలు అండగా నిలిచారు.. ఇప్పుడు నిలుస్తారు.. చట్టం మీద నాకు విశ్వాసం ఉంది.. పోలీసులు సహకరించండి’’ అంటూ ఈటల రాజేందర్ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.