విధాత : జలయజ్ఞంలో భాగంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొదలు పెట్టిన ప్రాజెక్టులు, కాలువలు మళ్లీ కాంగ్రెస్ హయం లోనే పూర్తవుతున్నాయని భువనగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. భువనగిరి వద్ద వరంగల్ – హైదరాబాద్ జాతీయ రహదారి కింది నుంచి వెళ్లే బస్వాపురం ప్రాజెక్టు కాలువను ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి శనివారం పరిశీలించారు. గోదావరి జలాలకు పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా అనిల్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి మాత్రమే ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలకు గోదావరి నీళ్లు వస్తున్నాయని, కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి కాదని స్పష్టం చేశారు.
బస్వాపురం ప్రాజెక్టు నుంచి కాలువల నిర్మాణం వైఎస్ .రాజశేఖర్ రెడ్డి హయంలోనే ప్రారంభమయ్యాయని.. ప్రభుత్వం మారడంతో బీఆర్ఎస్ పాలకులు వాటిని వం పట్టించుకోలేదని విమర్శించారు. భువనగిరి వద్ద వరంగల్ – హైదరాబాద్ జాతీయ రహదారి కింద నుంచి వెళ్లే కాలువను గత ప్రభుత్వం పూర్తి చేయకపోవడంతో కాలువ పరిధిలోని చెరువులకు నీరు అందలేదని అన్నారు. ప్రస్తుతం ఈ కాలువను పూర్తి చేయడంతో పాటు బునాదిగాని కాలువకు లింక్ చేయడం ద్వారా భువనగిరి, వలిగొండ మండలాలలోని చెరువులకు గోదావరి నీళ్లు అందించే కార్యక్రమం మొదలైందని, పంట పొలాలకు గోదావరి నీళ్లు అందించే ఏర్పాటు చేశామని తెలిపారు.
ఏడున్నర కోట్ల ఖర్చుతో కల్వర్టు నిర్మాణం పూర్తిచేసి బునాదిగాని కాలువకు గోదావరి నీళ్లు అందిస్తున్నట్టు కుంభం వెల్లడించారు. బస్వాపురం ప్రాజెక్టులో ఇంకా పూర్తిస్థాయిలో నీళ్లు నింపలేదనీ ముంపు గ్రామం బీఎన్ తిమ్మాపురంలో ప్రజలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద ఇంకా కొంత మందికి పరిహారం అందలేదని, మరో రూ.50 కోట్లు నిధులు విడుదల చేస్తే బీఎన్ తిమ్మాపూర్ గ్రామం ఖాళీ అయ్యి.. నీళ్లు నింపడానికి అనువుగా ఉంటుందన్నారు. ప్రస్తుతం బస్వాపురం ప్రాజెక్టు 0.7 టీఎంసీల నీరు నిల్వ సామర్థ్యం ఉందన్నారు.
భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి వద్ద కూడా రోడ్డును కటింగ్ చేసి కాలువ ద్వారా నీరు వెళ్లేలా చేసే కార్యక్రమం చేయబోతున్నట్లు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. మరో పైపు హైలెవల్ కాలువ నిర్మాణం ద్వారా వడపర్తి కత్వాకు నీరు వచ్చేలా భూసేకరణ మొదలైందని, మరో రూ.6 నుంచి 7 కోట్ల విలువ చేసే భూ సేకరణ పూర్తి అయితే హైలెవల్ కాలువ పూర్తి అయ్యి… వడపర్తి నుంచి బీబీనగర్ చెరువుకు నీరు అందుతుందని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి :
Modi Speaks With Pezeshkian : ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ కి ప్రధాని మోదీ ఫోన్
ఒకేసారి మూడు నెలల రేషన్ పంపిణీకి కేంద్రం నిర్ణయం
