Thummilla Lift Scheme | తుమ్మిళ్ల లిఫ్ట్ మోటార్లను ఆన్‌చేసిన ఎమ్మెల్యే విజయుడు.. పంపింగ్‌ను అడ్డుకున్న కాంగ్రెస్ నేత సంపత్
తుమ్మిళ్ల పంపు హౌస్ నుంచి నీటి విడుదల విషయం లో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే పోటీ పడడం తో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జోగులాంబ గద్వాల ల జిల్లా రాజోలి మండలం లోని తుమ్మిళ్ల పంపు హౌస్

– పంప్ హౌస్ వద్ద హైడ్రామా
– తుమ్మిళ్ల పంప్ హౌస్ వద్ద ఉద్రిక్త వాతావరణం
– నీటి విడుదల విషయం లో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య పొలిటికల్ వార్
– తుమ్మిళ్ల పంప్ హౌస్ మోటార్లను ఆన్ చేసిన ఎమ్మెల్యే విజయుడు
– మాజీ ఎమ్మెల్యే సంపత్ వచ్చి మోటార్లను ఆఫ్ చేసి ఆన్ చేసిన వైనం
– సంపత్ తీరుకు నిరసనగా విజయుడు పంప్ హౌస్ వద్ద బైటయింపు
– విజయుడిని పోలీస్ స్టేషన్ కు తరలింపు
విధాత, ఉమ్మడి,మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :తుమ్మిళ్ల పంపు హౌస్ నుంచి నీటి విడుదల విషయం లో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే పోటీ పడడం తో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జోగులాంబ గద్వాల ల జిల్లా రాజోలి మండలం లోని తుమ్మిళ్ల పంపు హౌస్ నుంచి సాగు నీరు అందించేందుకు మోటార్లను ఆన్ చేసేందుకు ముందుగా ఎమ్మెల్యే విజయుడు ముందుకు వచ్చారు. ఒక రోజు ముందే మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తుమ్మిళ్ల పంపు హౌస్ మోటార్లను ఆన్ చేస్తానని ప్రకటించారు. ఈ విషయం తెలుసుకున్న అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు మంగళవారం ఉదయమే సంపత్ కంటే ముందుగానే తుమ్మిళ్ల వద్దకు చేరుకొని మోటార్ల ను ఆన్ చేశారు. కొద్దిసేపటికి సంపత్ కుమార్ వచ్చి మోటార్లను బంద్ చేశారు. మళ్ళీ కాసేపటి తరువాత మోటార్ల ను ఆన్ చేశారు. మోటార్లు ఆన్ చేయడానికి మాజీ ఎమ్మెల్యే కు హక్కు లేదని ఎమ్మెల్యే విజయుడు నిరసన వ్యక్తం చేశారు. పంపు హౌస్ వద్ద బైటయించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సంపత్ వెళ్ళేదాకా ఇక్కడి నుంచి కదిలేది లేదని అక్కడే కూర్చున్నారు. వీరికి మద్దతుగా బీ ఆర్ ఎస్ నాయకులు భారీ సంఖ్య లో తుమ్మిళ్ల వద్ద కు చేరుకున్నారు. ఇదే సమయం లో కాంగ్రెస్ నాయకులు చేరుకోవడంతో పరిస్థితి అదుపుతప్పింది. పోలీసులు రంగప్రవేశం చేసి ఎమ్మెల్యే విజయుడికి నచ్చజెప్పినా ప్రయోజనం లేకపోయింది. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ఎమ్మెల్యే విజయుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే నుంచి ఉంచడం తో బీ ఆర్ ఎస్ నాయకులు పోలీస్ స్టేషన్ కు చేరుకొని నిరసన తెలిపారు. అంతకు ముందు ఎమ్మెల్యే విజయుడు మీడియా తో మాట్లాడారు. తుమ్మిళ్ల పంపు హౌస్ మోటార్ల ను ఆన్ చేసే అధికారం మాజీ ఎమ్మెల్యే కు లేదని, ఇదంతా రాజకీయం దురుద్దేశ్యం తో నియోజకవర్గం లో గొడవ లు సృష్టిచేందుకు ప్రయత్నం చేస్తున్నారని సంపత్ పై మండిపడ్డారు. ఓటమి జీర్ణించుకోలేని సంపత్ అధికారం ఉందనే ధీమా తో ఇలా అడ్డ దారుల్లో వచ్చి మోటార్లను ఆన్ చేయడం ఎంతవరకు సబబు అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. సంపత్ అరాచకాలకు ఇక్కడ ఎవ్వరు భయపడరనే విషయం గుర్తించుకోవాలన్నారు. తాను అలంపూర్ ఎమ్మెల్యే గా ఉన్న సమయం లో తుమ్మిళ్ల పంపు హౌస్ నిర్మాణం పనులు చేపట్టి పూర్తి చేయించానని, ఆ అధికారం తోనే పంపు హౌస్ మోటార్లను ఆన్ చేసానని సంపత్ కుమార్ పేర్కొన్నారు.ఈ సంఘటన పై బీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. నియోజకవర్గం లో ఎమ్మెల్యే ను కాదని మాజీ ఎమ్మెల్యే మోటార్లను ఆన్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రం లో దురదృష్ట వంతమైన పాలన కొనగసాగుతుందనడానికి ఈ సంఘటన అద్దం పడుతుందన్నారు. కాంగ్రెస్ నేతల దౌర్జన్యం ఇంకా ఎంతో కాలం సాగదని కేటీఆర్ పేర్కొన్నారు.ప్రజలు తిరస్క రించిన నాయకులు ప్రోటో్కాల్ కు విరుద్దంగా ప్రవర్తించడం ఎంత వరకు న్యాయం అని ఎక్స్ ద్వారా రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ని డిమాండ్ చేశారు.