పటేల్ కు ‘హ్యాండి’చ్చిన అనుచరులు.. బీఆర్ఎస్ లో చేరిక

విధాత, సూర్యాపేట: సూర్యాపేట నియోజకవర్గం టేకుమట్ల గ్రామంలో 86 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి జగదీశ్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. కాంగ్రెస్ నేత పటేల్ రమేష్ రెడ్డి అనుచరులు, 11, 7వ వార్డులకు చెందిన దుర్గా విజేశ్, పోతుల వరుణ్, ఇద్దరు వార్డు మెంబర్లు తదితరులు గులాబీ గూటికి చేరినవారిలో ఉన్నారు. వీరందరికీ మంత్రి గులాబీ కండువా వేసి బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు.