సీఎం కేసీఆర్‌ను కలిసిన మాజీ మంత్రి పొన్నాల

పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రగతి భవన్‌కు వచ్చిన పొన్నాల దంపతులను సీఎం కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు

సీఎం కేసీఆర్‌ను కలిసిన మాజీ మంత్రి పొన్నాల

విధాత : పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆదివారం సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రగతి భవన్‌కు వచ్చిన పొన్నాల దంపతులను సీఎం కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు. వారి యోగ క్షేమాలు అడిగారు తాజా రాజకీయ పరిస్థితులపై కూడా వారు చర్చించారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన పొన్నాలను మంత్రి కేటీఆర్ ఆయన ఇంటికి వెళ్లి మరి బీఆరెస్‌లోకి ఆహ్వానించారు. ఈ క్రమంలో కేసీఆర్‌తో పొన్నాల భేటీ అయ్యారు. పొన్నాల జనగామ టికెట్ ఆశించినప్పటికి ఇప్పటికే ఆ టికెట్‌ను అక్కడి సిటింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని కాదని, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి కేటాయించారు. ఈ నేపధ్యంలో కేసీఆర్‌తో పొన్నాల భేటీలో ఆయనకు పార్టీలో చేరికకు సంబంధించి ఎలాంటి హామీ ఇచ్చారన్నది సస్పెన్స్‌గానే ఉంది. పొన్నాల నేడు జనగామలో జరుగనున్న సీఎం కేసీఆర్ హాజరయ్యే బీఆరెస్ బహిరంగ సభలో పార్టీలో చేరుతారని భావిస్తున్నారు.