మాజీ సీఎం కేసీఆర్ కు పవర్ కమిషన్ మరోసారి నోటీసులు … 27వ తేదీలోగా సమాధానం చెప్పాలని నోటీస్

చత్తీస్ గడ్ విద్యుత్తు కొనుగోలు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణాలకు సంబంధించిన అవకతవకలపై అంశాలపై విచారణ చేపడుతున్న జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలోని పవర్ కమిషన్ బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు మరోసారి నోటీసులు జారీ చేసింది

మాజీ సీఎం కేసీఆర్ కు పవర్ కమిషన్ మరోసారి నోటీసులు … 27వ తేదీలోగా సమాధానం చెప్పాలని నోటీస్

విధాత : చత్తీస్ గడ్ విద్యుత్తు కొనుగోలు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణాలకు సంబంధించిన అవకతవకలపై అంశాలపై విచారణ చేపడుతున్న జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలోని పవర్ కమిషన్ బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు మరోసారి నోటీసులు జారీ చేసింది.ఈ నోటీసులో ఇప్పటివరకు కమిషన్ కు వచ్చిన సమాచారం పై మీ అభిప్రాయం ఎంటో చెప్పాలని కేసీఆర్ ను కోరింది. ఈనెల 27వ తేదీలోపు వివరణ ఇవ్వాలని పవర్ కమిషన్ కేసీఆర్ కు సూచించింది. ఈనెల 19వ తేదీనే కేసీఆర్ కు, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కి, మరికొంతమందికి పవర్ కమిషన్ ఇచ్చిన నోటీసులు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. పవర్ కమిషన్కు వ్యతిరేకంగా కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించిన సందర్భంలో రెండోసారి నరసింహారెడ్డి కమిషన్ కెసిఆర్ కు నోటీసులు ఇవ్వడం ఆసక్తి రేపింది.
గతంలో ఇచ్చిన నోటీసులలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్తు కొనుగోళ్లకు సంబంధించిన వివరణ కోరింది.పవర్ కమిషన్ నోటీసులపై ఘాటుగా స్పందించిన కేసీఆర్ కమిషన్ విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదని, కమిషన్ చైర్మన్ గా నరసింహారెడ్డి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు నరసింహారెడ్డికి లేఖ రాశారు. తాజాగా నరసింహారెడ్డి కమిషన్ విచారణ పై స్టే విధించాలని హైకోర్టును ఆశ్రయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన నరసింహారెడ్డి కమిషన్ ను న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఏర్పాటు చేశారని.. కమిషన్ విచారణను నిలిపివేయాలని కేసీఆర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కమీషన్ పిటిషన్ పై న్యాయస్థానం విచారణ చేపట్టకు ముందే పవర్ కమిషన్ మరోసారి కేసీఆర్ కు నోటీసులు జారీ చేయడం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై కేసీఆర్ ఇప్పుడు ఏ విధంగా స్పందిస్తారన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది.