Prashanth Reddy | కాలిఫోర్నియాలో మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి
కాలిఫోర్నియా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతం రిపాన్ అనే గ్రామంలో పండుతున్న ఆల్మాండ్ (బాదం) తోటలను మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు

బాదం తోటల పరిశీలన
విధాత : కాలిఫోర్నియా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతం రిపాన్ అనే గ్రామంలో పండుతున్న ఆల్మాండ్ (బాదం) తోటలను మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. ఒక్కొక్క తోట సుమారు 100 ఎకరాల్లో ఉండి డ్రిప్ సిస్టం, ఆధునిక టెక్నాలజీతో బాదం చెట్లను రైతులు పెంచుతున్నారని, వారు అవలంభిస్తున్న వ్యవసాయ పద్ధతుల వల్ల ఒక్కో చెట్టుకు విపరీతమైన దిగుబడి వస్తుంది అని ప్రశాంత్‌రెడ్డి తెలిపారు.
రైతు అక్కడే నివాసం ఏర్పాటు చేసుకొని బాదం తోటలను పెంచడమే కాకుండా అక్కడే తోటలో ప్రాసెసింగ్ యూనిట్ ని ఏర్పాటు చేసుకొన్నారని, ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా బాదం పలుకులను తీసి మార్కెటింగ్ చేసి లాభాలను గడిస్తున్నారని వివరించారు.
ప్రభుత్వం వారికి కెనాల్ ద్వారా సాగు నీరు అందిస్తుందని కెనాల్ నుండి నీటిని పంప్ చేసి డ్రిప్ సిస్టం ద్వారా రైతులు తోటలను సాగు చేస్తున్నారని తెలిపారు. మన దగ్గర వ్యవసాయ పద్ధతుల్లో కూడా నలుగురైదుగురు రైతులు కలిసి మొక్కజొన్న లేదా ఇతర పంటలకు ప్రాసెసింగ్ యూనిట్ అక్కడే ఏర్పాటు చేసుకుని మార్కెటింగ్ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని ప్రశాంత్‌రెడ్డి పేర్కోన్నారు