భూపాలపల్లిలో ప్రోటోకాల్ రగడ.. మంత్రి సురేఖకు అందని ఆహ్వానం?

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని మైలారం గ్రామంలో ఇండస్ట్రియల్ పార్క్ శంకుస్థాపన కార్యక్రమానికి అటవీ శాఖ మంత్రి కొండా సురేఖకు ఆహ్వానం అందకపోవడం పై జిల్లాలో చర్చ జరుగుతోంది

భూపాలపల్లిలో ప్రోటోకాల్ రగడ.. మంత్రి సురేఖకు అందని ఆహ్వానం?

ఫ్లెక్సీలో మహిళా మంత్రులకు అవమానం

విధాత, వరంగల్ ప్రతినిధి:ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని మైలారం గ్రామంలో ఇండస్ట్రియల్ పార్క్ శంకుస్థాపన కార్యక్రమానికి అటవీ శాఖ మంత్రి కొండా సురేఖకు ఆహ్వానం అందకపోవడం పై జిల్లాలో చర్చ జరుగుతోంది. దీనిపై ఆమె అభిమానులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. మంత్రుల పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో సైతం మహిళా మంత్రులైన సురేఖ, సీతక్క ఫోటోలను చిన్నగా ముద్రించడాన్ని వారి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. శనివారం భూపాలపల్లి జిల్లాలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు, సీతక్క జిల్లాలో పర్యటించారు. కాగా మహిళా మంత్రులకు జరిగిన ఈ అవమానంపై వారి అనుచరులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పర్యటనలో చోటు చేసుకున్న ఈ సంఘటనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు.