బీఆరెస్‌లో చేరిన రాగిడి, పటేల్‌లు

ఉప్పల్, గద్వాల కాంగ్రెస్ టికెట్లు ఆశించి భంగపడిన ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జీ రాగిడి లక్ష్మారెడ్డి, గద్వాల జిల్లా డీసీసీ అధ్యక్షుడలు పటేల్ ప్రభాకర్‌రెడ్డిలు బీఆరెస్‌లు బుధవారం బీఆరెస్‌లో చేరారు

బీఆరెస్‌లో చేరిన రాగిడి, పటేల్‌లు
  • కేసీఆర్ సమక్షంలో రాగిడి, హరీశ్ సమక్షంలో పటేల్‌ల చేరికలు

విధాత : ఉప్పల్, గద్వాల కాంగ్రెస్ టికెట్లు ఆశించి భంగపడిన ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జీ రాగిడి లక్ష్మారెడ్డి, గద్వాల జిల్లా డీసీసీ అధ్యక్షుడలు పటేల్ ప్రభాకర్‌రెడ్డిలు బీఆరెస్‌లు బుధవారం బీఆరెస్‌లో చేరారు. రాగిడి లక్ష్మారెడ్డి మేడ్చల్ బీఆరెస్ ప్రజాశీర్వాద సభలో సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆరెస్ తీర్ధం పుచ్చుకున్నారు. అటు తెలంగాణ భవన్‌లో మంత్రి హరీశ్‌రావు సమక్షంలో పటేళ్ ప్రభాకర్‌రెడ్డి తమ అనుచరులు, మద్దతుదారులతో కలిసి బీఆరెస్‌లో చేరారు. వారిద్దరు కాంగ్రెస్‌కు గుడ్ బై కొట్టి బీఆరెస్‌లో చేరడంతో ఉప్పల్‌, గద్వాల నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు కొంత ఎదురు దెబ్బగా భావిస్తున్నారు.