తెలంగాణ త‌ల్లి కేసీఆర్ ఫామ్ హౌజ్ లో బందీ అయ్యింది

విధాత‌: కొంపల్లిలో డిజిటల్ మెంబెర్ షిప్ డ్రైవ్ ను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, భట్టి క‌లిసి ప్రారంభించారు.బ్లాక్, మండల కాంగ్రెస్ నేతలకు రెండు రోజుల పాటు డిజిటల్ మెంబర్ షిప్ అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.ఎంత మంది నాయకులు పోయిన కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలమ‌ని,గల్లీలో కార్యకర్తలు కష్టపడితేనే ఢిల్లీలో సోనియమ్మ రాజ్యం వస్తుందన్నారు. రాష్ట్రాన్ని బీజేపీ, టీఆర్ఎస్ కలిసి దోచుకుంటున్నాయి.బీజేపీ, టీఆర్ఎస్ రెండు పార్టీలు తోడు దొంగలేన‌నిరైతులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం వరి వేస్తే […]

తెలంగాణ త‌ల్లి కేసీఆర్ ఫామ్ హౌజ్ లో బందీ అయ్యింది

విధాత‌: కొంపల్లిలో డిజిటల్ మెంబెర్ షిప్ డ్రైవ్ ను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, భట్టి క‌లిసి ప్రారంభించారు.బ్లాక్, మండల కాంగ్రెస్ నేతలకు రెండు రోజుల పాటు డిజిటల్ మెంబర్ షిప్ అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.ఎంత మంది నాయకులు పోయిన కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలమ‌ని,గల్లీలో కార్యకర్తలు కష్టపడితేనే ఢిల్లీలో సోనియమ్మ రాజ్యం వస్తుందన్నారు.

రాష్ట్రాన్ని బీజేపీ, టీఆర్ఎస్ కలిసి దోచుకుంటున్నాయి.బీజేపీ, టీఆర్ఎస్ రెండు పార్టీలు తోడు దొంగలేన‌ని
రైతులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం వరి వేస్తే ఉరే అని సీఎం సిగ్గులేకుండా మాట్లాడుతున్నారన్నారు.

రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది.కార్యకర్తల మనోభావాలు తెలుసుకోవడానికే ఈ రెండు రోజుల సదస్సు,క్రమశిక్షణ కాంగ్రెస్ లో ముఖ్యం.. క్రమశిక్షణ తప్పి తాగుబోతు సీఎం మాటలు నిజం చేయొద్దు.మేము పదవులు అనుభవిస్తున్నాం అంటే కార్యకర్తల వల్లేన‌ని తెలిపారు..

కష్టపడే కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటా.. సోనియమ్మ రాజ్యం కోసం కష్టపడే వారికి పదవులు, టికెట్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాన‌ని తెలంగాణ తల్లి సీఎం ఫామ్ హౌజ్ లో బందీ ఐనదని రేవంత్ పేర్కొన్నిరు.

కల్వకుంట్ల కుటుంబం నుంచి రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలపై ఉంది.పార్టీలో పదవులు అనుభవించి పార్టీ మారిన వాళ్ళు చచ్చిన వాళ్ళతో సమానం.. కష్టపడే కార్యకర్తలను రాహుల్ గాంధీతో సన్మానం చేయిస్తా కష్టపడని కార్యకర్తలపై జనవరి 26 తర్వాత నేనే చర్యలు తీసుకుంటాన‌ని రేవంత్ తెలిపారు.