Sree Vajra Residency Dispute | రిజిస్ట్రేషన్ లేకుండానే శ్రీవజ్ర రెసిడెన్సీ నిర్మాణం

Sree Vajra Residency Dispute | హైదరాబాద్‌కి చెందిన ఆర్‌ఆర్ క‌న్‌స్ట్రక్షన్స్‌ కంపెనీపై తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ రెగ్యులేట‌రి అథారిటీ (TG RERA) భారీ జరిమానా విధించింది. అడిక్‌మెట్‌, ల‌లితానగర్‌లోని శ్రీవజ్ర రెసిడెన్సీ ప్రాజెక్టును రిజిస్ట్రేషన్ చేయకుండా నిర్మించడంపై టిజి రెరా జూలై 1న ఆర్‌ఆర్ క‌న్‌స్ట్రక్షన్స్‌పై రూ.2,81,276 జరిమానా విధించింది.

Sree Vajra Residency Dispute | రిజిస్ట్రేషన్ లేకుండానే శ్రీవజ్ర రెసిడెన్సీ నిర్మాణం

• అడిక్‌మెట్‌–లలితానగర్‌లో ప్రాజెక్టు
• జరిమానా విధించిన టిజి రెరా

Sree Vajra Residency Dispute | ఫ్లాట్ నెం.302లో నివాసముంటున్నముద్రకర్త వీణధారి అనే నివాసితురాలి ఫిర్యాదు మేరకు ఈ నిర్ణయం తీసుకున్న TG RERA, ప్రాజెక్టుకు సంబంధించి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (OC) తక్షణమే పొందాలని, అనంతరం ఫ్లాట్ కొనుగోలుదారుల సంఘానికి అందించాలని ఆదేశించింది. వీణధారి టిజి రెరాకు ఇచ్చిన ఫిర్యాదులో, నిర్మాణం ముగిసిన రెండున్నరేళ్లకుపైగా అయినా జిహెచ్ఎంసీ సికింద్రాబాద్ జోన్ అధికారులతో తాను స్వంతంగా నిర్వహించిన పరిశీలనలో, బిల్డర్ OC కొరకు ఎలాంటి దరఖాస్తు చేసుకోలేదని వెల్లడైంది. అలాగే, 459.22 చ.మీ. స్థలంలో 8 ఫ్లాట్లనిర్మాణానికి అనుమతి ఉన్నా, 10 ఫ్లాట్లను నిర్మించడం కూడా స్పష్టమైన ఉల్లంఘన అని టిజిరెరాకు తెలియజేశారు.ఆమెచేసినమరోఆరోపణలో, పార్కింగ్‌లో నీటినిల్వ, సరైన వాననీటి షెడ్లు లేకపోవడం, లోపల, బయట పెయింటింగ్ నాణ్యత తక్కువగా ఉండడం, ప్లంబింగ్&సానిటరీ ఫిట్టింగ్స్‌లో నాణ్యతాలోపాలు, సిమెంట్ ప్యాచ్‌లు, నాచు మొలకెత్తడం వంటి అంశాలూ ఉన్నాయి. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మ‌ర్ ఏర్పాటు చేయకపోవడం పైనా ఆమె ఫిర్యాదు చేసారు. ఆ ఆరోపణలను ఖండించిన బిల్డర్ ఆర్‌ఆర్ క‌న్‌స్ట్రక్షన్స్‌, ఇది ఫిర్యాదుదారు చట్టప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని, తమపై ఆరోపించబడిన అన్ని అభియోగాలను కొట్టేయాలని కోరారు. అయితే TG RERA ఛైర్మన్‌ ఎన్. సత్యనారాయణ, సభ్యులుశ్రీనివాస్ రావు, లక్ష్మీనారాయణ ఇరు పక్షాల ఆరోపణల సమీక్ష తర్వాత ఫిర్యాదు నిజమేనని తేల్చి బిల్డర్‌పై జరిమానా విధించారు. TG RERA ఆదేశాలప్రకారం, బిల్డర్ 30 రోజులలోపు రూ.2.81 లక్షల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ తీసుకుని యాజమాన్య సంఘానికి అందించాలి. అలాగే పార్కింగ్‌లో నీటినిల్వ సమస్యను పరిష్కరించి ట్రాన్స్‌ఫార్మర్‌ను పనిచేసేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
Tags: