BSPలోకి R.S. ప్రవీణ్ కుమార్…!?
విధాత:ఐపీఎస్ కు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ రాజకీయంగా కీలక అడుగులు వేస్తున్నారు. ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న రోజునే ఆయన రాజకీయాల్లోకి వస్తారని, ఆయన నూతన రాజకీయపార్టీ పెట్టబోతున్నారని ఓ కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో ప్రధాన మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మొత్తం ఆయన టిఆర్ఎస్ లో చేరతారని కథనాలు ప్రచురించాయి. అయితే దళితుల అభివృద్ధి కోసం నిత్యం తపించే ఆయన స్వంత పార్టీని పెడతారని చెప్పింది. అయితే దళితుల […]

విధాత:ఐపీఎస్ కు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ రాజకీయంగా కీలక అడుగులు వేస్తున్నారు. ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న రోజునే ఆయన రాజకీయాల్లోకి వస్తారని, ఆయన నూతన రాజకీయపార్టీ పెట్టబోతున్నారని ఓ కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో ప్రధాన మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మొత్తం ఆయన టిఆర్ఎస్ లో చేరతారని కథనాలు ప్రచురించాయి. అయితే దళితుల అభివృద్ధి కోసం నిత్యం తపించే ఆయన స్వంత పార్టీని పెడతారని చెప్పింది. అయితే దళితుల కోసం పనిచేస్తోన్న బిఎస్పీలో చేరాలని ఆయన నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. బిఎస్పీ అయితే జాతీయ స్థాయిలో దళితుల హక్కుల కోసం ఉద్యమించవచ్చుననే భావన ఆయనలో ఉందని వారు చెబుతున్నారు. బీఎస్పీ నుంచి ఆయనకు ఆహ్వానం ఉందని, ఆయనకు జాతీయ స్థాయిలో ముఖ్యమైన పదవి దక్కుతుందంటున్నారు. అయితే ఆయన ఎప్పుడు బీఎస్సీలో చేరతారనే దానిపై క్లారిటీ లేదు. బీఎస్పీకి తెలంగాణలో దాదాపు 2శాతం ఓట్లు ఉంటాయని, ప్రవీణ్ ఆ పార్టీలో చేరితే ఆ శాతం మరింత పెరుగుతందనే అంచనాలు ఉన్నాయి. దళితులు, మైనార్టీల ఓట్లు ప్రవీణ్ వల్ల చీలిపోతాయనే అంశంపై తెలంగాణలో చర్చ సాగుతోంది. సాధారణంగా ఈ ఓట్లు అన్నీ కాంగ్రెస్ వైపే ఉంటాయి. ఇప్పడు బీఎస్పీ, ప్రవీణ్ వల్ల మరింతగా కాంగ్రెస్ కు దెబ్బతగులుతుందనే మాట వినిపిస్తోంది. కెసిఆరే ప్రవీణ్ తో ఇలా చేయిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ప్రవీణ్ తో కెసీఆరే ఉద్యోగానికి ముందుగా రాజీనామా చేయించారని, ఇదంతా వారి పథకమేనన్న మాటలకు ఈ రోజు ప్రవీణ్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనమంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం తనను వేధిస్తోందని కెసిఆర్ పై సంచలన విమర్శలు చేశారు. తనను ప్రభుత్వం వేధిస్తుంటే రాష్ట్రంలో ఉన్న 29 మంది దళిత ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారని, ఇదంతా దళితులను తన వైపు తిప్పుకునేందుకేనని, కెసిఆర్, ప్రవీణ్ లు కలసి నాటకం ఆడుతున్నారని, వారిద్దరి లక్ష్యం దళితుల ఓటు బ్యాంక్ లో భారీ చీలిక తెచ్చి కాంగ్రెస్ ను దెబ్బకొట్టాలన్నవ్యూహం మేరకు ఇలా ఆరోపణలు చేసుకుంటున్నారన్నారు. ప్రవీణ్ దాదాపుగా ఏడేళ్లుగా ఒకే పోస్టులో పనిచేసినా ఆయనను అక్కడ నుంచి కదిలించలేదని, పైగా ఆయనను కెసిఆర్ ప్రోత్సహించారని, ఇప్పుడు హఠాత్తుగా ఇలా వ్యతిరేకులుగా మారడం వెనుక వారి వ్యూహం మేరకే అని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తం మీద ప్రవీణ్ ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళుతున్నారనే మాట రాజకీయ వర్గాలు అంటున్నాయి.