సైలెంట్ పీరియ‌డ్ షురూ.. స్థానికేతరులు నియోకవర్గాలను వద‌లాలి: సీఈఓ

సైలెంట్‌ పీరియడ్ మొదలైంది ఎలాంటి ఎన్నికల మెటీరియల్‌ను ప్రదర్శించకూడదని సీఈవో వికాస్‌రాజ్ వెల్ల‌డించారు. స్థానికేతరులు నియోకవర్గాలను వదిలివెళ్లాలని

సైలెంట్ పీరియ‌డ్ షురూ.. స్థానికేతరులు నియోకవర్గాలను వద‌లాలి: సీఈఓ

విధాత‌: సైలెంట్‌ పీరియడ్ మొదలైంది ఎలాంటి ఎన్నికల మెటీరియల్‌ను ప్రదర్శించకూడదని సీఈవో వికాస్‌రాజ్ వెల్ల‌డించారు. స్థానికేతరులు నియోకవర్గాలను వదిలివెళ్లాలని, ఎలాంటి రాజకీయ ప్రకటనలను ఇవ్వకూడదన్నారు. బుధ‌వారం ఎన్నికల అధికారులు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు వెళ‌తార‌న్నారు. మాక్‌ పోల్‌ కోసం గురువారం ఉదయం 5.30 కల్లా పోలింగ్‌ ఏజెంట్లు రావాలన్నారు. అదేవిధంగా ఈవీఎంల‌ను పోలింగ్‌ ఏజెంట్లు ముట్టుకోకూడదని తెలిపారు.

తొలిసారి 27 వేల 178 మంది హోం ఓటింగ్ వినియోగించుకున్నారన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్నవారికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తున్నామ‌ని, 27 వేల 98 పోలింగ్‌ స్టేషన్లలో వెబ్‌ కాస్టింగ్ ఏర్పాట్లు చేసిన‌ట్లు పేర్కొన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు అనుమతించేది లేద‌ని వెల్ల‌డించారు వికాస్ రాజ్‌.