మరోసారి సీఎం కేసీఆర్ హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం

మరోసారి సీఎం కేసీఆర్ హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం
  • రోడ్డు మార్గాన సిర్పూర్‌కు కేసీఆర్‌

విధాత : సీఎం కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో మరోసారి సాంకేతిక లోపం తలెత్తింది. సిర్పూర్ కాగజ్ నగర్ ప్రజాశీర్వాద సభ నుంచి అసిఫాబాద్‌ బయలుదేరే ముందు పైలట్ హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్యను గుర్తించడంతో హెలికాప్టర్‌ను అక్కడే ఆపివేశారు. కొద్దిసేపటికి హెలికాప్టర్ మళ్లీ టెకాఫ్ అయ్యింది. అయితే సీఎం కేసీఆర్ అసిఫాబాధ్ బీఆరెస్ ప్రజాశీర్వాద సభకు రోడ్డు మార్గన వెళ్లిపోయారు. ఈ వారంలో సీఎం కేసీఆర్ హెలికాప్టర్లో రెండోసారి సాంకేతిక లోపం తలెత్తడం చర్చనీయాంశమైంది. ఇటీవల ఎర్రవెల్లి ఫామ్ హౌజ్ నుంచి దేవరకద్ర సభకు వెళ్లే ముందు కూడా హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది.