గ్రూప్ -1 నియామకాలపై సుప్రీం తీర్పు స్వాగతనీయం : సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ గ్రూప్ -1 ఉద్యోగ నియామకాల విషయంలో భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తన ఎక్స్ ఖాతాలో తెలిపారు. ఇది ఉద్యోగ నియామకాల పట్ల మా ప్రభుత్వ పారదర్శకతకు, చిత్తశుద్ధికి గుర్తింపు గా భావిస్తున్నట్లుగా ట్వీట్ లో పేర్కొన్నారు.

గ్రూప్ -1 నియామకాలపై సుప్రీం తీర్పు స్వాగతనీయం : సీఎం రేవంత్ రెడ్డి

విధాత, హైదరాబాద్ : తెలంగాణ గ్రూప్ -1 ఉద్యోగ నియామకాల విషయంలో భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తన ఎక్స్ ఖాతాలో తెలిపారు. ఇది ఉద్యోగ నియామకాల పట్ల మా ప్రభుత్వ పారదర్శకతకు, చిత్తశుద్ధికి గుర్తింపు గా భావిస్తున్నట్లుగా ట్వీట్ లో పేర్కొన్నారు.

కొలువుల కోసం ఏళ్లకు ఏళ్లు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసి, కన్నవారి కష్టంపై ఆధారపడలేక, కొలువు వస్తుందో రాదో అన్న దిగులుతో పదేళ్లు కాలం వెళ్లదీసిన గ్రూప్ -1 ఆశావహులకు ఇది పెద్ద ఊరట అని రేవంత్ రెడ్డి అభివర్ణించారు.

ప్రజా ప్రభుత్వం వచ్చీరావడంతోనే నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్షలు నిర్వహించి నెలల వ్యవధిలో నియామక పత్రాలు అందజేసి, ఈ నియామకాలను అడ్డుకోవాలనుకున్న దుష్ట శక్తుల కుట్రలను కుతంత్రాలను ఛేదించి, రాష్ట్ర పునర్ నిర్మాణంలో తొలి గ్రూప్ -1 అధికారులుగా యువతను భాగస్వాములను చేశాం అని.. వారికి మరో సారి నా అభినందనలు అంటూ పోస్టు చేశారు.

ప్రభుత్వం ఆలోచనలు, సంకల్పానికి అనుగుణంగా టీజీపీఎస్సీ వ్యవస్థను ప్రక్షాళన చేసి, నిరుద్యోగ యువతకు వ్యవస్థ పట్ల విశ్వాసాన్ని పునరుద్ధరించి, అత్యంత పారదర్శకంగా ఈ నియామకాలను పూర్తి చేసిన టీజీపీఎస్సీ ఛైర్మన్, ఉద్యోగులు, సిబ్బందికి ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

ఉద్యోగాలు పదిలం

2024 గ్రూప్-1 నోటిఫికేషన్ ద్వారా టీజీపీఎస్సీ (TGPSC) చేపట్టిన 563 గ్రూప్-1 పోస్టుల నియామక ప్రక్రియ చట్టబద్ధమేనని జస్టిస్ విక్రమ్‌నాథ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేయడంతో అభ్యర్థుల నియామకాలపై అడ్డంకులన్నీ తొలగిపోయాయి.

పరీక్షల్లో అక్రమాలు జరిగాయని, మూల్యాంకనంలో తప్పులు దొర్లాయని, ఆ నోటిఫికేషన్ రద్దు చేసి.. మళ్లీ కొత్తగా పరీక్షలు నిర్వహించాలంటూ పలువురు అభ్యర్థులు వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో ఇప్పటికే ఉద్యోగాల్లో చేరిన గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళన తొలగిపోయింది.

ఇవి కూడా చదవండి :

యుద్దం ఎఫెక్ట్.. నావికులను కోల్పోయిన ఏకైక దేశం భారత్ !
Traffic Restrictions | ఎల్లుండి ఉప్ప‌ల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ ఆంక్ష‌లు ఇలా..