మానవాళి మనుగడకు చెట్లే జీవనాధారం..రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి సీతక్క
చెట్లు, మానవాళికి, మనిషి మనుగడకు జీవనాధారం ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గ్రహించి చెట్లను పెంచడం, వాటిని సంరక్షించడం చేయాలని రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క అన్నారు.

విధాత:చెట్లు, మానవాళికి, మనిషి మనుగడకు జీవనాధారం ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గ్రహించి చెట్లను పెంచడం, వాటిని సంరక్షించడం చేయాలని రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క అన్నారు. హైదారాబాద్ మహాత్మా జ్యోతి రావు పూలే ప్రజా భవన్ లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బుధవారం మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. చెట్టును మనం కాపాడితే ఆ చెట్టు మనల్ని కాపాడుతుందన్నారు. మానవ జాతి మనుగడకు తొలి మెట్టు చెట్టు అని మనమందరం భాధ్యత తీసుకొని మన పరిసరాల చుట్టూ, మన ఇళ్ల చుట్టూ, మీరు పని చేసే కార్యాలయ ఆవరణలో మొక్కలను నాటి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు కంకణ బద్దులు కావాలని మంత్రి అన్నారు.