ఇద్దరు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య

విధాత: ర్యాంకుల ఒత్తిడికి ఓ విద్యార్థి బలవన్మరణానికి దారితీసింది. అమీర్‌పేట ఓం సాయినగర్ కాలనీకి చెందిన మంచన వైభవ్(16) ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చైతన్యపురి నారాయణ కాలేజీ ఇంటర్ చదువుతున్న వైభవ్ తన సూసైడ్ నోట్‌లో కళాశాల యాజమాన్యం ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని చేస్తున్న ఒత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని, విద్యార్థులు ఎవరు కూడా ఈ కళాశాలలో చేరవద్దని పేర్కోన్నాడు.
పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వైభవ్ ఆత్మహత్యకు కళాశాల యాజమాన్యం వైఖరినే కారణమని ఆరోపిస్తు తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. ఇంకోవైపు కామారెడ్డి జిల్లా మడ్నూర్ మండలం పెద్ద ఎక్లార శివారులోని రెసిడెన్షియల్ స్కూల్ ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని వసుధ(17) హాస్టల్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బిచ్కుంద మండలానికి చెందిన వసుధ దసరా సెలవుల అనంతరం సోమవారమే హా్స్టల్‌కు తిరిగి వచ్చి ఆత్మహత్యకు పాల్పడటం కుటుంబ సభ్యులను విషాదానికి గురి చేసింది. తల్లిదండ్రులు, బంధువులు ఆగ్రహంతో పాఠశాలపై దాడి చేసి ధర్నా చేశారు.