ఫలించిన మైనంపల్లి కృషి.. నర్సాపూర్ బీఅర్ఎస్ కు బిగ్ షాక్

ఎట్టకేలకు కాంగ్రెస్ నాయకుడు మైనంపల్లి హన్మంతరావు కృషి ఫలించింది. నర్సాపూర్ నియోజక వర్గానికి 5 సార్లు ఎమ్మెల్యేగా సీపీఐ నుండి ప్రాతినిధ్యం వహించిన విఠల్ రెడ్డి

ఫలించిన మైనంపల్లి కృషి.. నర్సాపూర్ బీఅర్ఎస్ కు బిగ్ షాక్
  •  కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కుటుంబం

విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: ఎట్టకేలకు కాంగ్రెస్ నాయకుడు మైనంపల్లి హన్మంతరావు కృషి ఫలించింది. నర్సాపూర్ నియోజక వర్గానికి 5 సార్లు ఎమ్మెల్యేగా సీపీఐ నుండి ప్రాతినిధ్యం వహించిన విఠల్ రెడ్డి కుటుంబ సభ్యులు బీఅర్ఎస్ ను వీడారు. ఆపార్టీ ఉమ్మడి జిల్లా మహిళా అధ్యక్షురాలు చిలిముల సుహాసిని రెడ్డి, కుమారుడు, మాజీ జడ్పీటీసీ శేష సాయిరెడ్డి, అనుచరులు బీఅర్ఎస్ కు రాజీనామా చేశారు. గురువారం ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వారి వెంట గాలి అనిల్ కుమార్, కౌడిపల్లి బీఅర్ఎస్ యూత్ అధ్యక్షులు కృష్ణాగౌడ్, సుదీర్ రెడ్డి ఉన్నారు.