Weather Report | వారం పాటు వానలు లేనట్లే..! మళ్లీ దంచికొట్టనున్న ఎండలు..!!
Weather Report | గత రెండు వారాల నుంచి కురిసిన భారీ వర్షాలకు( Heavy Rains ) తెర పడింది. మరో వారం రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని, పగటి ఉష్ణోగ్రతలు( Temperatures ) పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ( Weather Department ) వెల్లడించింది.

Weather Report | హైదరాబాద్ : గత రెండు వారాలు వానలు దంచికొట్టిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోకి గత వారం నైరుతి రుతుపవనాలు( Monsoon ) ప్రవేశించడంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు( Heavy Rains ) కురిసి.. రైతులను నిండా ముంచాయి.
ఇక ఈ వర్షాలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని ప్రజలు భావించారు. కానీ వారం రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు( Moderate Rains ) మాత్రమే కురిసే అవకాశం ఉందన్నారు. భారీ వర్షాలకు ఆస్కారమే లేదన్నారు. జూన్ 5వ తేదీ వరకు భారీ వర్షాలు లేవని వాతావరణ శాఖ( Weather Department ) అధికారులు పేర్కొన్నారు.
ఈ క్రమంలో పగటి ఉష్ణోగ్రతలు( Temperatures ) పెరిగే అవకాశం ఉందన్నారు. అంటే మళ్లీ ఎండలు దంచికొట్టనున్నాయి. పగటి పూట 36 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. 36 డిగ్రీలకు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ లేదని స్పష్టం చేశారు. ఇక జూన్ 5 వరకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది వాతావరణ శాఖ.