Gold Rate | ఐదు నెలల కనిష్ఠానికి బంగారం ధరలు..! నేడు హైదరాబాద్‌ మార్కెట్‌లో ధరలు ఎలా ఉన్నాయంటే..?

Gold Rate | యూఎస్‌ వడ్డీ రేట్ల పెంపు మరింత కాలం కొనసాగుతుందన్న అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు ఐదు నెలల కనిష్ఠానికి పడిపోయాయి. ప్రస్తుతం ఔన్స్‌కు 1918 డాలర్లు పలుకుతున్నది. ఇక భారత బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల స్వర్ణం రూ.54,300 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.59,220 వద్ద కొనసాగుతున్నది. చెన్నైలో 22 క్యారెట్ల పుత్తడి రూ.54,550 […]

Gold Rate | ఐదు నెలల కనిష్ఠానికి బంగారం ధరలు..! నేడు హైదరాబాద్‌ మార్కెట్‌లో ధరలు ఎలా ఉన్నాయంటే..?

Gold Rate |

యూఎస్‌ వడ్డీ రేట్ల పెంపు మరింత కాలం కొనసాగుతుందన్న అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు ఐదు నెలల కనిష్ఠానికి పడిపోయాయి. ప్రస్తుతం ఔన్స్‌కు 1918 డాలర్లు పలుకుతున్నది.

ఇక భారత బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల స్వర్ణం రూ.54,300 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.59,220 వద్ద కొనసాగుతున్నది.

చెన్నైలో 22 క్యారెట్ల పుత్తడి రూ.54,550 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.59,500కి చేరింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.54,150 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.59,070కి పెరిగింది.

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం రూ.54,150 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.59,070 వద్ద ట్రేడవుతున్నది.

ఇక హైదరాబాద్‌ మార్కెట్‌లో 22 క్యారెట్ల తులం బంగారం రూ.54,150కి పెరిగింది. అదే సమయంలో 24 క్యారెట్ల బంగారం రూ.59,070 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

వెండి ధరలు స్థిరంగా కొనసాగుతుండగా.. కిలోకు రూ.73,300 పలుకుతున్నది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.76,500గా ఉన్నది.