Singer Kalpana: ఆ వార్త‌లు అవాస్త‌వం.. ఆ రోజు ఏం జ‌రిగిందో చెప్పిన‌ సింగర్ కల్పన!

తాజాగా తనపై వస్తున్న రూమర్స్ కు చెక్ పెడుతూ కల్పన కీలక స్టెట్మెంట్ విడుదల చేశారు.

Singer Kalpana: ఆ వార్త‌లు అవాస్త‌వం.. ఆ రోజు ఏం జ‌రిగిందో చెప్పిన‌ సింగర్ కల్పన!

Singer Kalpana :

ఇటీవల మోతాదుకు మించి నిద్రమాత్ర (Sleeping pills) లు వేసుకుని ఆపస్మారక స్థితి unconsciousness కి చేరుకుని ఆసుపత్రి పాలైన (Hospitalized) సింగర్ కల్పన ఎట్టకేలకు కోలుకున్నారు. తాజాగా తనపై వస్తున్న రూమర్స్ కు చెక్ పెడుతూ కల్పన కీలక స్టెట్మెంట్ విడుదల చేశారు. నేను ఇటీవల ఆత్మహత్య యత్నం చేసుకున్నానన్న ప్రచారం అవాస్తవమని.. మీడియాలో నా గురించి.. నా భర్త గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారని అవన్ని అవాస్తమని వీడియో విడుదల చేశారు.

నేను ప్రస్తుతం క్షేమంగా ఉన్నానని..నా వయసు 45సంవత్సరాలని..ఈ వయస్సులో నేను ఎల్ ఎల్బీ పీహెచ్ డీ చేస్తున్నానని..నా భర్త సహకారం, ప్రోత్సాహంతో మ్యూజిక్ లో నేను బిజీ గా ఉన్నానన్నారు. దీంతో అనేక పనుల కారణంగా నేను స్ట్రెస్ కు గురయ్యానని..అందుకే నిద్ర సరిగా లేకపోవడంతో నేను కొంచెం ఎక్కువ నిద్ర మాత్రలు వేసుకున్నానని తెలిపారు.

మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు, మా కుటుంబం చాల ఆనందంగా ఉందని.. నా భర్త ప్రసాద్ ప్రభాకర్, కూతురు దయా ప్రసాద్ లతో తాను సంతోషంగా జీవిస్తున్నానని స్పష్టం చేశారు. త్వరలోని నేను మళ్లీ పాటలు పాడుతానన్నారు. మోతాదుకు మించి నిద్రమాత్రలు వేసుకున్న సమయంలోనూ నన్ను నా భర్త ప్రసాద్ నన్ను కాపాడేందుకు ఎంతో కృషి చేశారని..ఆయన కారణంగానే సకాలంలో ఆసుపత్రితో చేర్చబడి ప్రాణాపాయం నుంచి బయటపడ్డానన్నారు. ఈ వ్యవహారంలో ఇక ఎవరు ఎలాంటి దుష్ప్రచారం చేయొద్దని కోరిన కల్పన అభిమానుందరికి కృతజ్ఞతలు తెలిపారు.

కాగా రెండు రోజుల క్రితం మోతాదుకు మించి నిద్రమాత్రలు సేవించిన కల్పన ఆత్మహత్య ప్రయత్నం చేసుకుందని పోలీసులు సహా అంతా అనుమానించారు. కేరళాలో ఉన్న తన కూతురు తన వద్ధకు రాలేదన్న మనస్తాపంతో అతిగా నిద్రమాత్రలు వేసుకున్నట్లుగా వార్తలు వెలువడ్డాయి. ఆసుపత్రిలో చికిత్స అనంతరం కోలుకున్నాక తాను పొరపాటున నిద్రమాత్రలు ఎక్కువగా వేసుకున్నట్లుగా పోలీసులకు స్టెట్మెంట్ ఇవ్వడంతో కల్పన ఆత్మహత్య యత్నం ప్రచారానికి తెరపడింది. తాజాగా తను స్వయంగా మరో వీడియో విడుదల చేసి మరింత క్లారిటీ ఇచ్చింది.