బీజేపీ దేశానికి ద్రోహం చేస్తోంది: మంత్రి జగదీష్ రెడ్డి

విధాత, నల్గొండ: విద్వేష పూరిత రాజకీయాలతో దేశానికి ద్రోహం చేస్తున్న బీజేపీ పార్టీకి మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పాలని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఆదివారం నాంపల్లి మండలం మల్లెపురాజు గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని, పాఠశాల అదనపు గదులను, పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్పొరేట్ శక్తులకు దాసోహమై, దేశాన్ని అమ్ముతున్న బీజేపీ పార్టీలో చేరి రాజగోపాల్ రెడ్డి చరిత్ర హినుడిగా మిగిలిపోయడని అన్నారు. మునుగోడు ఉప […]

బీజేపీ దేశానికి ద్రోహం చేస్తోంది: మంత్రి జగదీష్ రెడ్డి

విధాత, నల్గొండ: విద్వేష పూరిత రాజకీయాలతో దేశానికి ద్రోహం చేస్తున్న బీజేపీ పార్టీకి మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పాలని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఆదివారం నాంపల్లి మండలం మల్లెపురాజు గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని, పాఠశాల అదనపు గదులను, పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్పొరేట్ శక్తులకు దాసోహమై, దేశాన్ని అమ్ముతున్న బీజేపీ పార్టీలో చేరి రాజగోపాల్ రెడ్డి చరిత్ర హినుడిగా మిగిలిపోయడని అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో గులాబీ పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుందని అన్నారు. బీజేపీ పార్టీ మూడో స్థానంలో ఉందన్నారు. ఓటేసి గెలిపించిన మునుగోడు ప్రజలను వెన్నుపోటు పొడిచి, అమ్ముడు పోయిన రాజగోపాల్ రెడ్డి కి ఓటమి తప్పదని అన్నారు.

మునుగోడు నియోజకవర్గంలో ఏ గ్రామానికి పోయిన ప్రజలు, కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలి వచ్చి టిఆర్ఎస్ లో చేరుతున్నారని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ,జిల్లా ఇంచార్జి తక్కెళ్లపల్లి రవీందర్ రావు. మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, పార్టీ నాయకుడు విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.