ఒకే ఈతలో రెండు దూడలకు జన్మనిచ్చిన ఆవు
విధాత: ఒక ఈతలో ఒకే దూడకు ఆవులు జన్మనివ్వడం చూశాం. కానీ ఓ ఆవు ఒక ఈతలోనే రెండు దూడలకు జన్మనిచ్చింది. ఈ రెండు దూడలను చూసేందుకు ఆ రైతు ఇంటికి క్యూ కట్టారు. ఈ అరుదైన ఘటన సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రుక్మాపూర్ గ్రామంలో వెలుగు చూసింది. ఆదివారం సాయంత్రం ఒక ఆవు రెండు దూడలకు జన్మనిచ్చింది. గ్రామానికి చెందిన గొల్ల లక్ష్మన్న అనే రైతుకు చెందిన ఆవు మూడో ఈతలో రెండు కోడెదూడలకు […]

విధాత: ఒక ఈతలో ఒకే దూడకు ఆవులు జన్మనివ్వడం చూశాం. కానీ ఓ ఆవు ఒక ఈతలోనే రెండు దూడలకు జన్మనిచ్చింది. ఈ రెండు దూడలను చూసేందుకు ఆ రైతు ఇంటికి క్యూ కట్టారు. ఈ అరుదైన ఘటన సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రుక్మాపూర్ గ్రామంలో వెలుగు చూసింది.
ఆదివారం సాయంత్రం ఒక ఆవు రెండు దూడలకు జన్మనిచ్చింది. గ్రామానికి చెందిన గొల్ల లక్ష్మన్న అనే రైతుకు చెందిన ఆవు మూడో ఈతలో రెండు కోడెదూడలకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు, రైతులు ఆవు దూడలను చూసేందుకు ఆ ఇంటికి క్యూ కట్టారు. ఆవు దూడలను చూసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఆవు దూడలు ఆరోగ్యంగా ఉన్నాయి. మూడో ఈతలో రెండు కోడెదూడలకు ఆవు జన్మను ఇవ్వడంతో రైతు కుటుంబ సభ్యులు సంతోషంలో మునిగిపోయారు.