బ్యాగులో బంగారం.. నిజాయితీ చాటుకున్న హైదరాబాద్ పోలీసులు
విధాత, హైదరాబాద్: డీజీపీ ఆఫీసుకు కూతవేటు దూరంలోని రవీంద్ర భారతి సమీపంలో నడి రోడ్డుపై ఓ బ్యాగు పడిపోయింది. ఆ బ్యాగును తీసుకునేందుకు ఓ ఆటో డ్రైవర్ యత్నించారు. డీజీపీ ఆఫీసు వద్ద విధుల్లో ఉన్న కానిస్టేబుల్, హోంగార్డు ఆ విషయాన్ని గమనించారు. ఇక ఆటో డ్రైవర్‌ను అడ్డుకుని, బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. బ్యాగు తెరిచి చూడగా అందులో రూ. 10,050 నగదు, 3.8 తులాల బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత బ్యాగును సైఫాబాద్ […]

విధాత, హైదరాబాద్: డీజీపీ ఆఫీసుకు కూతవేటు దూరంలోని రవీంద్ర భారతి సమీపంలో నడి రోడ్డుపై ఓ బ్యాగు పడిపోయింది. ఆ బ్యాగును తీసుకునేందుకు ఓ ఆటో డ్రైవర్ యత్నించారు. డీజీపీ ఆఫీసు వద్ద విధుల్లో ఉన్న కానిస్టేబుల్, హోంగార్డు ఆ విషయాన్ని గమనించారు.
ఇక ఆటో డ్రైవర్‌ను అడ్డుకుని, బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. బ్యాగు తెరిచి చూడగా అందులో రూ. 10,050 నగదు, 3.8 తులాల బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత బ్యాగును సైఫాబాద్ పోలీసులకు అప్పగించారు.
బ్యాగులోని ఆధార్ కార్డు, ఇతర ఆధారాలతో బాధితురాలిని గుర్తించారు. కూకట్‌పల్లికి చెందిన పద్మ కుమారిగా గుర్తించిన పోలీసులు.. ఆమెకు సమాచారం అందించారు. సైఫాబాద్ పీఎస్ కు చేరుకున్న పద్మకుమారికి బ్యాగు అందించారు.
ఈ సందర్భంగా కానిస్టేబుల్ శ్యామ్ కుమార్, హోం గార్డు నారాయణ రావు, పోలీసు వెహికల్ డ్రైవర్ గోవర్ధన్‌కు పద్మకుమారి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నిజాయితీ చాటుకున్న పోలీసులపై ఉన్నతాధికారులు ప్రశంసలు కురిపించారు.