బీజేపీకి మేలు చేసేందుకే కేసీఆర్ జాతీయ రాజకీయాలు: రేవంత్ రెడ్డి
విధాత, నల్గొండ: మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికల్లో టికెట్ పార్టీ నాయకులంతా సమిష్టిగా పనిచేసి పార్టీ గెలుపుకు పని చేయాలని తగిన సమయంలో అందరికీ గుర్తింపు కల్పించేలా చూస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం మునుగోడు అభ్యర్థి పాల్వాయి స్రవంతితో పాటు, టికెట్ ఆశించిన పల్లె రవికుమార్ గౌడ్, కైలాష్ నేత, చలమల కృష్ణా రెడ్డిలతో భేటీ అయ్యారు. ఈ భేటీ పిదప రేవంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. మునుగోడు లో ఐదు దశాబ్దాల […]

విధాత, నల్గొండ: మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికల్లో టికెట్ పార్టీ నాయకులంతా సమిష్టిగా పనిచేసి పార్టీ గెలుపుకు పని చేయాలని తగిన సమయంలో అందరికీ గుర్తింపు కల్పించేలా చూస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం మునుగోడు అభ్యర్థి పాల్వాయి స్రవంతితో పాటు, టికెట్ ఆశించిన పల్లె రవికుమార్ గౌడ్, కైలాష్ నేత, చలమల కృష్ణా రెడ్డిలతో భేటీ అయ్యారు.
ఈ భేటీ పిదప రేవంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. మునుగోడు లో ఐదు దశాబ్దాల కాలంగా పాల్వాయి కుటుంబం కాంగ్రెస్ కోసం పని చేసిందన్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో.. సోనియా గాంధీ పాల్వాయి స్రవంతి కి టిక్కెట్ కేటాయించారన్నారు. ఈ ఉప ఎన్నికల్లో అందరూ కలిసి కట్టుగా పని చేయాలి. కార్యకర్తలు.. ప్రజలు కాంగ్రెస్ నేతలు ఉమ్మడిగా పని చేయాలని ఆశిస్తున్నారన్నారు.
శత్రువులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని.. కాంగ్రెస్ నేతలంతా కలిసి కట్టుగా పని చేయాలన్నారు.
టిక్కెట్ దక్కకపోయినా.. అభ్యర్థి కంటే రెండు గంటలు ఎక్కువ పని చేస్తామని పల్లె రవికుమార్, కైలాష్, కృష్ణా రెడ్డి మాట ఇచ్చారని. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు. ముగ్గురికి పార్టీ లో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. మునుగోడు నాయకులు తీసుకున్న నిర్ణయం ఆదర్శనీయమన్నారు.
వీరిని స్ఫూర్తి గా తీసుకొని మిగతా నేతలు పార్టీ గెలుపుకు ముందుకు రావాలన్నారు.
కేసీఆర్ పెట్టే కొత్త జాతీయపార్టీలో కుమార స్వామి పార్టీ ని విలీనం చేస్తాడా అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ ఎంతసేపు యూపీఏ భాగస్వామ్య పక్షాలను దూరం చేయాలని చూస్తున్నాడని,
ఎన్డీయే భాగస్వామ్య పక్షాలను ఒక్కరినీ కలవలేదన్నారు. జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబు, నవీన్ పట్నాయక్, ఏక్ నాథ్ షిండే లను కేసీఆర్ కలవడని, కాంగ్రెస్ తో ఉన్న నితీష్ కుమార్, శిబుసోరేన్ , ఉద్దవ్ థాక్రే, స్టాలిన్ లను కలవడంలో మతలభేంటి అంటూ నిలదీశారు.
నరేంద్రమోదీ ని మూడోసారి పీఎం చేసేందుకు కేసీఆర్.. తెలంగాణకు కేసీఆర్ ను మూడోసారి సీఎం చేసేందుకు బీజేపీలు పరస్పరం పని చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా ఉండేందుకు చిల్లర పంచాయతీలు చేస్తున్నారని, అస్సాం సీఎం కు అక్కడ గణేష్ నిమజ్జనం లేదా.. వస్తే దేవుడి దగ్గర రాజకీయాలు అవసరమా అంటూ విమర్శించారు.
కేంద్రం తీసుకున్న నిర్ణయాల వల్ల సామాన్యుడు బతికే పరిస్థితి లేదని, అన్ని సమస్యలు పక్కదారి పట్టేందుకు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, హైదరాబాద్ నగరాన్ని, రాష్ట్రాన్ని తగలబెట్టి అధికారం కోసం టీఆర్ఎస్, బీజేపీ పని చేస్తున్నాయని ఆరోపించారు. పశ్చిమబెంగాల్ ఫార్ములా మేరకు ప్రశాంత్ కిషోర్ సూచన మేరకు ఇరు పార్టీ లు పని చేస్తున్నాయన్నారు.
ఈ కుట్రలు కుతంత్రాలను చేదించడానికే… రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర చేస్తున్నారన్నారు.
రాష్ట్రంలో 50 రోజులలో వీ.ఆర్.ఏ లు 28 మంది ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వం స్పందించడం లేదను, రెండు నెలలు గా జీతాలు ఇవ్వకుండా వీ.ఆర్.ఏ లను వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఇలాగే గతంలో ఆర్టీసీ కార్మికుల చావుకు కారణమయ్యాడని దుయ్యబట్టారు.