Ketu Vishwanatha Reddy
విధాత: ప్రసిద్ధ సాహితీవేత్త కేతు విశ్వనాథరెడ్డి ఈ రోజు ఉదయం కన్నుమూశారు. విద్యావేత్తగా, కథా రచయితగా సుప్రసిద్ధుడైన కేతు విశ్వనాథ రెడ్డి ‘కథలు’ అనే కథా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు.
జూలై 10, 1939న వైఎస్ఆర్ జిల్లా కమలాపురం తాలూకా రంగశాయిపురం గ్రామంలో జన్మించిన ఆయన కడప జిల్లా గ్రామ నామాలు అనే అంశంపై పరిశోధనకు గాను డాక్టరేట్ పొందారు.
పాత్రికేయుడిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి కడప, తిరుపతి, హైదరాబాదులలో అధ్యాపకుడిగా పనిచేసి డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డైరెక్టరుగా పదవీవిరమణ చేశారు.
పాఠ్యపుస్తకాల రూపకల్పనలో SCERT సంపాదకుడుగా వ్యవహరించారు. పాఠశాల స్థాయి నుంచి విశ్వ విద్యాలయ స్థాయి దాకా అనేక పాఠ్య పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. పాఠ్య ప్రణాళికలను రూపొందించారు. ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి పత్రికాసిబ్బందికి శిక్షణ ఇచ్చారు.
పురస్కారాలు
కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు (న్యూ ఢిల్లీ),
భారతీయ భాషా పరిషత్తు (కలకత్తా),
తెలుగు విశ్వవిద్యాలయం (హైదరాబాదు),
రావిశాస్త్రి అవార్డు,
రితంబరీ అవార్డు.
అధ్యాపకుడిగా
విశ్వవిద్యాలయ అధ్యాపకులకు రాష్ట్రప్రభుత్వం ఇచ్చే ఉత్తమ అధ్యాపక పురస్కారం