LOC Tension| సరిహద్దుల్లో మళ్లీ పాక్ కాల్పులు..తిప్పికొట్టిన భారత సైన్యం

ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత నియంత్రణ రేఖ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. నియంత్రణ రేఖ(ఎల్ వోసీ) వెంట పాకిస్తాన్ మరోసాకి కవ్వింపు చర్యలకు పాల్పడింది. కుప్వారాలోని నౌగామ్‌ సెక్టార్‌లో పాకిస్థాన్‌ దళాలు కాల్పులకు దిగాయి. పాక్ దళాల కాల్పులను భారత సైన్యం తిప్పికొట్టింది.

LOC Tension| సరిహద్దుల్లో మళ్లీ పాక్ కాల్పులు..తిప్పికొట్టిన భారత సైన్యం

న్యూఢిల్లీ : నియంత్రణ రేఖ(ఎల్ వోసీ) వెంట పాకిస్తాన్(Pakistan firing) మరోసాకి కవ్వింపు చర్యలకు పాల్పడింది(LOC Tension). కుప్వారాలోని నౌగామ్‌ సెక్టార్‌లో పాకిస్థాన్‌ దళాలు కాల్పులకు దిగాయి. పాక్ దళాల కాల్పులను భారత సైన్యం(Indian Army) తిప్పికొట్టింది. పాక్ కాల్పుల చర్యలతో ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత నియంత్రణ రేఖ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.

శనివారం సాయంత్రం 6.15 గంటలకు ఈ ఘటన జరగగా.. సుమారు గంట పాటు కాల్పులు కొనసాగాయి. ఇందులో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఆపరేషన్ సిందూర్ తర్వాత సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తతలు రేగడంతో నియంత్రణ రేఖ వెంట భద్రత దళాలు గస్తీ పెంచాయి.