కేసీఆర్ ని దేశ‌ద్రోహి అంటారా.. బీజేపీ నేత‌ల‌పై మండిప‌డ్డ కేటీఆర్

విధాత: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దేశద్రోహి అన్న భాజపా నేతల వ్యాఖ్యలపై.. మంత్రి కేటీఆర్​ తీవ్రంగా స్పందించారు. కొవిడ్ తీవ్రత, చలి ఉన్నప్పటికీ ఏడాదిపాటు రైతులను వీధుల పాలు చేసిన వారు దేశభక్తులా అని ట్విట్టర్​ వేదికగా కేటీఆర్​ ప్రశ్నించారు. ఇదే సమయంలో ఆ రైతులకు ఆపన్నహస్తం అందించినవారు ద్రోహులవుతారా అని కేటీఆర్ అడిగారు. దేశభక్తిపై సర్టిఫికేట్‌ ఇవ్వడానికి వీళ్లెవరని మంత్రి మండిపడ్డారు. కాగా రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు కేసీఆర్​ ఆర్థిక సాయం చేయడంపై […]

కేసీఆర్ ని దేశ‌ద్రోహి అంటారా.. బీజేపీ నేత‌ల‌పై మండిప‌డ్డ కేటీఆర్

విధాత: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దేశద్రోహి అన్న భాజపా నేతల వ్యాఖ్యలపై.. మంత్రి కేటీఆర్​ తీవ్రంగా స్పందించారు. కొవిడ్ తీవ్రత, చలి ఉన్నప్పటికీ ఏడాదిపాటు రైతులను వీధుల పాలు చేసిన వారు దేశభక్తులా అని ట్విట్టర్​ వేదికగా కేటీఆర్​ ప్రశ్నించారు. ఇదే సమయంలో ఆ రైతులకు ఆపన్నహస్తం అందించినవారు ద్రోహులవుతారా అని కేటీఆర్ అడిగారు. దేశభక్తిపై సర్టిఫికేట్‌ ఇవ్వడానికి వీళ్లెవరని మంత్రి మండిపడ్డారు. కాగా రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు కేసీఆర్​ ఆర్థిక సాయం చేయడంపై భాజపా నేతలు మండిపడ్డారు. ఆయన దేశద్రోహిగా పేర్కొంటూ పలు వ్యాఖ్యలు చేశారు.