ప్రగతిభవన్ చక్రధారి హరీశ్
హైదరాబాద్, మే 12: ఆర్థిక మంత్రి హరీశ్రావు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆంతరంగిక మంత్రాంగంలో చేరిపోయారని, ఇప్పుడు ఆయనే చక్రం తిప్పుతున్నారని ప్రగతిభవన్లో సన్నిహితంగా మెలిగిన ఒక ఎమ్మెల్సీ చెబుతున్నారు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్పై చర్యలు తీసుకోవడంలో కూడా ప్రధాన పాత్ర హరీశ్రావుదేనని ఆయన విశ్లేషించారు. కేసీఆర్పై అసంతృప్తితో ఉన్నకాలంలో రాజేందర్, హరీశ్రావు సన్నిహితంగా మెలిగారని, కోపతాపాలన్నీ పంచుకున్నారని ఇప్పుడు వాటి ప్రభావం కనిపిస్తున్నదని ఆయన తెలిపారు. ప్రగతిభవన్లో ఇప్పుడు హరీశ్రావు ఏమి చెబితే అది జరుగుతున్నదని, […]

హైదరాబాద్, మే 12: ఆర్థిక మంత్రి హరీశ్రావు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆంతరంగిక మంత్రాంగంలో చేరిపోయారని, ఇప్పుడు ఆయనే చక్రం తిప్పుతున్నారని ప్రగతిభవన్లో సన్నిహితంగా మెలిగిన ఒక ఎమ్మెల్సీ చెబుతున్నారు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్పై చర్యలు తీసుకోవడంలో కూడా ప్రధాన పాత్ర హరీశ్రావుదేనని ఆయన విశ్లేషించారు. కేసీఆర్పై అసంతృప్తితో ఉన్నకాలంలో రాజేందర్, హరీశ్రావు సన్నిహితంగా మెలిగారని, కోపతాపాలన్నీ పంచుకున్నారని ఇప్పుడు వాటి ప్రభావం కనిపిస్తున్నదని ఆయన తెలిపారు.
ప్రగతిభవన్లో ఇప్పుడు హరీశ్రావు ఏమి చెబితే అది జరుగుతున్నదని, రాజ్యసభ సభ్యుడు సంతోష్రావు ప్రాధాన్యం కూడా తగ్గించారని ఆ ఎమ్మెల్సీ తెలిపారు. సంతోష్రావు మనుషులు చాలా మందిని ప్రగతిభవన్ నుంచి పంపించి వేశారని కూడా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్ది వారాలుగా పూర్తిగా హరీశ్రావుపై ఆధారపడుతున్నారని, హరీశ్రావు ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేదాకా ప్రగతిభవన్లోనే ఉంటున్నారని, అన్ని శాఖల మంతనాల్లో పాల్గొంటున్నారని ఆ వర్గాలు తెలిపాయి. బుధవారం ఆరోగ్యశాఖ సమీక్షలో కూడా హరీశ్రావు కీలకపాత్ర పోషించారని, మంత్రివర్గ విస్తరణ జరిగితే ఆ శాఖను కూడా ఆయనకే అప్పగిస్తారని ప్రచారం జరుగుతున్నది.
తొలుత హరీశ్రావు, ఈటెల కలిసి తిరుగుబాటు ఆలోచనలు చేశారని, అయితే ఇద్దరు సమస్కందులు కావడంతో ఎవరు నాయకత్వం వహించాలన్న అంశంపై వారిపై ఒక అవగాహన కుదరలేదని, అది చివరకు బాగా అంతరం సృష్టించిందని తెలుస్తున్నది. నాయకత్వం అంశం వచ్చే సరికి తనను కూడా కేసీఆర్ కుటుంబ సభ్యునిగానే పరిగణిస్తూ రాజేందర్ వర్గం వారు మాట్లాడడం హరీశ్రావుకు రుచించలేదని అందుకే ఆయన తిరిగి కేసీఆర్తో ఉండడమే సరైనదన్న నిర్ణయానికి వచ్చారని తెలుస్తున్నది.
కేసీఆర్ వెనుక జరుగుతున్న అసమ్మతి రాజకీయాలను చక్కదిద్దడానికి హరీశ్రావే సరైనవారని కేసీఆర్ కూడా భావించారని ఆ వర్గాలు తెలిపాయి. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు మద్దతు కూడగట్టడంకోసం లోటస్పాండు అతిథి గృహంలో జరిగిన కులపెద్దల సమ్మేళనంలో హరీశ్ను దూరంగా ఉంచడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమయిందని, హరీశ్ను తిరిగి కీలకం చేయడంలో ఆ పరిణామం కూడా తోడ్పడిందని ఆ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.