కోమటిరెడ్డితో స్రవంతి భేటీ.. ప్రచారానికి వస్తానని హామీ
విధాత, నల్గొండ: మునుగోడు ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వయి స్రవంతి ఆదివారం కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిశారు. తనకు పార్టీ టికెట్ రావడంలో సహకరించిన వెంకటరెడ్డికి, సీనియర్లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా స్రవంతి ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ప్రచారం చేయాలని వెంకటరెడ్డిని కోరారు. స్రవంతి విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన వెంకటరెడ్డి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ప్రచారం చేయడానికి వస్తానని హామీ ఇచ్చినట్లు స్రవంతి తెలిపారు.

విధాత, నల్గొండ: మునుగోడు ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వయి స్రవంతి ఆదివారం కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిశారు. తనకు పార్టీ టికెట్ రావడంలో సహకరించిన వెంకటరెడ్డికి, సీనియర్లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా స్రవంతి ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ప్రచారం చేయాలని వెంకటరెడ్డిని కోరారు. స్రవంతి విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన వెంకటరెడ్డి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ప్రచారం చేయడానికి వస్తానని హామీ ఇచ్చినట్లు స్రవంతి తెలిపారు.