తెలంగాణ: షుగర్, బీపీ రోగులకు ఉచితంగా మందులు
విధాత: షుగర్, బీపీ, హైబీపీ వంటి దీర్ఘకాలిక రోగాలతో బాధ పడుతున్నవారికి వచ్చేనెల నుంచి నాన్ కమ్యూనబుల్ డిసీజెస్ (ఎన్సీడీ) కిట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.శనివారం ఎన్‌హెచ్‌ఎంలో భాగంగా నిర్వహించిన సమీక్షలో ఈ కిట్లను పరిశీలించారు.రాష్ట్ర వ్యాప్తంగా అసంక్రమిత వ్యాధులను గుర్తించడంలోభాగంగా పరీక్షలు నిర్వహించగా..ఏడు లక్షల మంది షుగర్ పేషెంట్లు, 20 లక్షల మంది బీపీ పేషెంట్లు ఉన్నట్టు తేలింది. వీరందరికీ దశలవారీగా ఎన్సీడీ కిట్లను పంపిణీ చేయనున్నట్టు అధికారులు తెలిపారు. షుగర్, బీపీ నియంత్రణ మందులు […]

విధాత: షుగర్, బీపీ, హైబీపీ వంటి దీర్ఘకాలిక రోగాలతో బాధ పడుతున్నవారికి వచ్చేనెల నుంచి నాన్ కమ్యూనబుల్ డిసీజెస్ (ఎన్సీడీ) కిట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.శనివారం ఎన్‌హెచ్‌ఎంలో భాగంగా నిర్వహించిన సమీక్షలో ఈ కిట్లను పరిశీలించారు.రాష్ట్ర వ్యాప్తంగా అసంక్రమిత వ్యాధులను గుర్తించడంలోభాగంగా పరీక్షలు నిర్వహించగా..ఏడు లక్షల మంది షుగర్ పేషెంట్లు, 20 లక్షల మంది బీపీ పేషెంట్లు ఉన్నట్టు తేలింది. వీరందరికీ దశలవారీగా ఎన్సీడీ కిట్లను పంపిణీ చేయనున్నట్టు అధికారులు తెలిపారు.
షుగర్, బీపీ నియంత్రణ మందులు అందించే ఈ కిట్లను ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించింది. ‘ఉన్నతమైన జీవనానికై ఆరోగ్యకరమైన అలవాట్లు’ అనే నినాదాన్ని కిట్లపై ప్రచురించింది. సమతుల ఆహారం, వ్యాయామం, పొగ తాగరాదు, జంక్ ఫుడ్ తినరాదు, మద్యం సేవించరాదు, యోగా, మంచి నిద్ర వంటి ఆరోగ్యకరమైన అలవాట్ల గురించి పేర్కొన్నది. షుగర్, బీపీ లక్షణాలతోపాటు వాటి వల్ల కలిగే దుష్పరిణామాల గురించి వివరించింది. కిట్‌లో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో వేసుకొనే మందులు నెలకు సరిపోయే షుగర్, బీపీ మందులను ఉంచి కిట్లను రోగులకు అందించనున్నారు.