Paragliding Horror | ఆకాశంలో యాక్సిడెంట్.. విమానం ఢీకొట్టడంతో గాల్లోనే ప్రాణాల కోసం పోరాడిన పారా గ్లైడర్.. వీడియో వైరల్!
Paragliding Horror | పారాగ్లైడింగ్ చేస్తున్న మహిళకు ఊహించని భయానక అనుభవం ఎదురైంది. ఓ విమానం అకస్మాత్తుగా వచ్చి ఢీకొట్టడంతో గాల్లోనే ప్రాణాల కోసం పోరాడింది. సమయస్ఫూర్తిగా వ్యవహరించి రిజర్వ్ ప్యారాచూట్ సాయంతో సేఫ్‌గా కిందకు దిగింది.
Paragliding Horror | గాల్లో విహరిస్తూ ఆనందంగా పారాగ్లైడింగ్ చేస్తున్న మహిళకు ఊహించని భయానక అనుభవం ఎదురైంది. క్షణాల్లోనే ఓ చిన్న విమానం మృత్యువు రూపంలో దూసుకొచ్చి.. ఆమె పారాగ్లైడర్‌ను చీల్చేసింది. కిందపడితే ప్రాణాలు దక్కవనే పరిస్థితి.. చావు అంచుల దాకా వెళ్లినప్పటికీ ఆ మహిళ మాత్రం ధైర్యం కోల్పోలేదు. సమయస్ఫూర్తిగా వ్యవహరించి రిజర్వ్ ప్యారాచూట్‌ను తెరిచి కిందపడే వేగాన్ని నియంత్రించుకుని ప్రాణాలతో బయటపడింది. ప్రాణాల కోసం గాల్లో ఆమె చేసిన పోరాటం ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
ఆస్ట్రియాలోని జెల్ ఆమ్ సీ ప్రాంతంలోని ష్మిట్టెన్హోవే పర్వత ప్రాంతాల్లో ఈ ప్రమాదం జరిగింది. వైరల్ వీడియో ప్రకారం.. 44 ఏళ్ల సబ్రినా అనే మహిళ ఆకాశంలో పారాగ్లైడింగ్ చేస్తోంది. ఆ అనుభవాన్ని తన కెమెరాలో రికార్డ్ చేస్తూ ఎంజాయ్ చేస్తోంది. అదే సమయంలో పర్యాటకులను తీసుకెళ్లే ఒక సైట్‌సీయింగ్ విమానం ఆమె వైపు అకస్మాత్తుగా దూసుకొచ్చి ఢీకొట్టింది. సబ్రినా తలకు అతి దగ్గరగా ఆ వినాం వచ్చింది. పారాగ్లైడర్ కేనాపీని చీల్చుకుంటూ వెళ్లిపోయింది.
పారాగ్లైడర్ కేనాపీ చినిగిపోవడంతో ఒక్కసారిగా పరిస్థితి అదుపుతప్పింది. సబ్రినా గాల్లోనే గింగిరాలు తిరుగుతూ కిందపడబోయింది. ఆ భయంతో గట్టిగట్టిగా అరిచింది. కానీ ఆ సమయంలో తనను తానే కాపాడుకోవాలనే నిర్ణయానికి వచ్చి గాల్లోనే ప్రాణాలతో పోరాడింది. తనను కంట్రోల్ చేసుకునేందుకు ప్రయత్నించింది. సమయస్ఫూర్తిగా వ్యవహరించి ఎమర్జెన్సీ సమయాల్లో ఉపయోగించే రిజర్వ్ ప్యారాచూట్‌ను తెరిచింది. అదృష్టవశాత్తూ ప్యారాచూట్ తెరుచుకోవడంతో కిందపడే వేగాన్ని సబ్రినా నియంత్రించింది. నెమ్మదిగా నేలపై ల్యాండ్ అయ్యింది. అయితే ఆ సమయంలో భూమిపై గట్టిగా పడటంతో ఆమె గాయపడింది.
More than a skill: Cessna hits paraglider mid-air over Austria. Both survive. The paraglider pulled her rescue chute. The pilot landed safely. Luck is not a safety protocol. Neither is hope! pic.twitter.com/hcAX1UTS43
— Stephen Mutoro (@smutoro) May 24, 2026
ఈ ప్రమాదం గురించి తెలియగానే పోలీసులు అప్రమత్తమయ్యారు. హెలికాప్టర్ ద్వారా సబ్రినాను వెతికి ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ప్రమాదానికి కారణమైన విమానం కూడా జెల్ ఆమ్ సీ ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. అయితే ఆ సమయంలో విమానం కంట్రోల్ కాలేదని.. పారాగ్లైడర్‌ను ఢీకొనకుండా నియంత్రించలేకపోయానని పైలట్ వివరించారు.
ఈ ప్రమాదం నుంచి బయటపడిన సబ్రినా సోషల్‌మీడియాలో స్పందించింది.. ఇది నాకు రెండో పుట్టినరోజులాంటిదే. నేను ఇంకా బతికే ఉన్నా అంటే నమ్మలేకపోతున్నా. కొన్ని స్వల్ప గాయాలు, నొప్పులు తప్ప పెద్దగా ఏమీ కాకపోవడం నా అదృష్టం అంటూ భావోద్వేగంగా ఓ పోస్టు పెట్టింది. దీనిపై నెటిజన్లు కూడా భిన్నంగా స్పందిస్తున్నారు. అదృష్టం ఎప్పుడూ సేఫ్టీ ప్రొటోకాల్ కాదని కొందరు కామెంట్ చేయగా.. ఇది సినిమా సన్నివేశాన్ని తలపిస్తోందని మరికొందరు అన్నారు. ఆ మహిళ ప్రాణాలతో బయటపడం నిజంగా అద్భుతమని మరికొందరు అభిప్రాయపడ్డారు.
Read More:
కోమాలో నుంచి బయటకొచ్చి ముగ్గురు పిల్లల గురించి ఆరా తీసిన టీనేజర్.. షాక్‌లో పేరెంట్స్!
శోభనం రాత్రి భార్యను మేకప్ లేకుండా చూసి కంగుతిన్న కొత్త పెళ్లి కొడుకు..!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram