బైక్ తో రైలును లాగేందుకు యత్నం..వైరల్ గా వీడియో

పశ్చిమ బెంగాల్ రైడర్ సోహెల్ బైక్‌తో రైలును లాగేందుకు యత్నించిన వీడియో వైరల్ అయింది. .అది చూసిన నెటిజన్లు రైల్వే ఆస్తులకు నష్టం కలిగించేలా ఉన్న ఈ చర్యపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

విధాత, హైదరాబాద్ : పశ్చిమ బెంగాల్‌కు చెందిన రైడర్ సోహెల్ తన బైక్‌తో రైలును లాగేందుకు ప్రయత్నించిన ఘటన వివాదాస్పదమైంది. ఇటీవల ఎంజీ మెజెస్టర్ ఎస్ యూవీ కారు ఓ రైలును లాగి గిన్నిస్ రికార్డ్ సృష్టించగా, దాన్ని అధిగమించే క్రమంలో సోహెల్ తాజాగా తన బైక్ తో రైలును లాగే దుస్సాహసం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా..అది చూసిన నెటిజన్లు రైల్వే ఆస్తులకు నష్టం కలిగించేలా ఉన్న ఈ చర్యపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇలాంటి వాటిని ప్రోత్సాహించినా..చూసి చూడినట్లుగా వదిలేసినా..రీల్స్ కోసం, వ్యూస్ కోసం ఇదే తరహా దుస్సాహాసాలకు యువత పాల్పడే ప్రమాదం ఉందని..ఇటువంటి వాటిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

హైదరాబాద్ నాలా పనుల్లో జాప్యం..కట్టెల వంతెన వీడియో వైరల్!
ఇది దేశ వ్యతిరేక బిల్లు : రాహుల్ గాంధీ

Latest News