10 మంది మావోయిస్టుల మృతి
విధాత(రాయ్‌పూర్): అడవుల్లో ఉండే మావోయిస్టులను సైతం కరోనా వైరస్ వదలడం లేదు. ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లా దక్షణి బస్తర్ అడవుల్లో కరోనాతో 10 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందినట్లు దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ వెల్లడించారు. మరో 100 మంది కరోనా బారిన పడినట్లు తమకు సమాచారం ఉందని ఆయన తెలిపారు. కరోనా సోకడం, కలుషిత ఆహారం తినడంతో మావోయిస్టులు చనిపోయినట్లు తెలుస్తోంది. కరోనాతో చనిపోయిన వారిలో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు సమాచారం. అయితే మృతి […]

విధాత(రాయ్‌పూర్): అడవుల్లో ఉండే మావోయిస్టులను సైతం కరోనా వైరస్ వదలడం లేదు. ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లా దక్షణి బస్తర్ అడవుల్లో కరోనాతో 10 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందినట్లు దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ వెల్లడించారు. మరో 100 మంది కరోనా బారిన పడినట్లు తమకు సమాచారం ఉందని ఆయన తెలిపారు. కరోనా సోకడం, కలుషిత ఆహారం తినడంతో మావోయిస్టులు చనిపోయినట్లు తెలుస్తోంది.
కరోనాతో చనిపోయిన వారిలో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు సమాచారం. అయితే మృతి చెందిన మావోయిస్టుల పేర్లు వెల్లడి కాలేదు. ఇక కుంట, డోర్నపాల్ ఏరియాల్లో మావోయిస్టులు కరోనా వ్యాక్సిన్‌తో పాటు దానికి సంబంధించిన ఔషదాలను దొంగిలించినట్లు పోలీసులు తెలిపారు.