విభిన్న ద‌ర్శ‌కునితో విల‌క్ష‌ణ న‌టుడు..!

విధాత: కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో కూడా హీరో సూర్యకు విలక్షణ నటుడిగా ఒక పేరు ఉంది. ఆయన చిత్రాలు అంటే సంథింగ్ స్పెషల్‌గా ఉంటాయని భావించేవారు ఎందరో ఉన్నారు. అందుకే ఆయన చిత్రాలకు తెలుగులో కూడా ఓపెనింగ్స్ బాగానే ఉంటాయి. ఇటీవల జై భీమ్, ఆకాశం నీ హద్దురా వంటి చిత్రాలతో మంచి విజయాన్ని అందుకొని అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. సూర్య ప్రస్తుతం తన 42వ సినిమాగా చిరుతై శివ దర్శకత్వంలో ఓ పీరియాడికల్ హిస్టారికల్ […]

విభిన్న ద‌ర్శ‌కునితో విల‌క్ష‌ణ న‌టుడు..!

విధాత: కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో కూడా హీరో సూర్యకు విలక్షణ నటుడిగా ఒక పేరు ఉంది. ఆయన చిత్రాలు అంటే సంథింగ్ స్పెషల్‌గా ఉంటాయని భావించేవారు ఎందరో ఉన్నారు. అందుకే ఆయన చిత్రాలకు తెలుగులో కూడా ఓపెనింగ్స్ బాగానే ఉంటాయి. ఇటీవల జై భీమ్, ఆకాశం నీ హద్దురా వంటి చిత్రాలతో మంచి విజయాన్ని అందుకొని అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు.

సూర్య ప్రస్తుతం తన 42వ సినిమాగా చిరుతై శివ దర్శకత్వంలో ఓ పీరియాడికల్ హిస్టారికల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ బ్యానర్లలో సంయుక్తంగా ఈ సినిమాను భారీ ఎత్తున రూపొందిస్తున్నాయి. దాదాపు పది భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే సూర్య భవిష్యత్‌లో ఓ విభిన్న శైలి గల డైరెక్టర్‌తో జత కట్టేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. మలయాళంలో అంగమలై డైరీ, జల్లికట్టు వంటి సినిమాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న లీజో జోష్ ఇప్పటికే సూర్యకు వినూత్నమైన కథను చెప్పాడని తెలుస్తోంది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆయ‌నే వెల్లడించారు. తను చెప్పిన స్టోరీ లైన్‌కు సూర్య ఇంప్రెస్ అయ్యారని, కానీ కొన్ని అనివార్య కారణాల వలన ప్రాజెక్ట్ మరికొంత ఆలస్యం అవుతుందని ఆయన చెప్పుకొచ్చారు.

నిజానికి ప్రస్తుతం లీజో జోస్ మోహన్‌లాల్‌తో ఒక సినిమా చేస్తున్నారు. ఈ మధ్యనే ఆయన మోహన్ లాల్ తో మలైకోటై వాలిబాన్ అనే చిత్రాన్ని ప్రకటించారు. మరోపక్క సూర్య 42వ సినిమా పూర్తి అయిన తర్వాత వెట్రిమార‌న్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించాల్సి ఉంది.

అయితే డైరెక్టర్ బాలతో చేస్తున్న సినిమా నుంచి బయటకు వచ్చేశానని సూర్య ప్రకటించిన తర్వాత మరో సినిమా ప్రకటించలేదు. కాబట్టి ఈ మలయాళ దర్శకుడితో సూర్య 44వ సినిమా చేసే అవకాశం ఉందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.