తమిళనాడులో సంపూర్ణ లాక్‌డౌన్‌

విధాత‌(చెన్నై): తమిళనాడులో భారీగా క‌రోనా కేసులు పెరుగుతుండ‌డంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు 14 రోజుల పాటు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 10వ తేదీన ఉదయం 4 గంటల నుంచి ఈ నెల 24వ తేదీ ఉదయం 4 గంటల వరకు అమలులో ఉంటుందని వెల్లడించింది. కిరాణ, కూరగాయలు, మాంసం దుకాణాలు, ఫార్మాసీ దుకాణాలు మినహా మిగతా అన్ని దుకాణాలు మూసివేయనున్నట్లు తెలిపింది. శుక్రవారం ఒకే […]

తమిళనాడులో సంపూర్ణ లాక్‌డౌన్‌

విధాత‌(చెన్నై): తమిళనాడులో భారీగా క‌రోనా కేసులు పెరుగుతుండ‌డంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు 14 రోజుల పాటు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ అమలు చేయనున్నట్లు ప్రకటించింది.

ఈ నెల 10వ తేదీన ఉదయం 4 గంటల నుంచి ఈ నెల 24వ తేదీ ఉదయం 4 గంటల వరకు అమలులో ఉంటుందని వెల్లడించింది. కిరాణ, కూరగాయలు, మాంసం దుకాణాలు, ఫార్మాసీ దుకాణాలు మినహా మిగతా అన్ని దుకాణాలు మూసివేయనున్నట్లు తెలిపింది. శుక్రవారం ఒకే రోజు రాష్ట్రంలో 26,465 కొత్త కేసులు నమోదయ్యాయి.

క్రియాశీల కేసులు 1.35 లక్షలకు చేరుకున్నాయి. ఒకే 197 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకు 15,171కి పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసులు 13.23లక్షలకు చేరాయి. చెన్నైలో కరోనా కారణంగా సగటు మరణాల సంఖ్య గత రెండు నెలల్లో వేగంగా పెరిగింది. గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ (జీసీసీ) అధికారిక సమాచారం ప్రకారం.. మార్చిలో నగరంలో ప్రతి రోజూ సగటున ముగ్గురు వ్యక్తులు కొవిడ్‌ కారణంగా మృతి చెందారు.