క‌రోనాపై పోరుకు మ‌రో కీల‌క అస్త్రం

విధాత‌(న్యూఢిల్లీ): క‌రోనాపై పోరుకు మ‌రో కీల‌క అస్త్రం డాక్ట‌ర్ల‌కు అందుబాటులోకి రానుంది. ఇది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆర్గ‌నైజేష‌న్ (డీఆర్డీవో) సంధిస్తున్న అస్త్రం. డీఆర్డీవో త‌యారు చేసిన 2-డియాక్సీ-డీ-గ్లూకోజ్ (2-డీజీ) ఔష‌ధ అత్య‌వ‌స‌ర వినియోగానికి డ్ర‌గ్ కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమ‌తి ఇచ్చింది. ఇది స్వ‌ల్ప నుంచి మోస్త‌రు క‌రోనాతో బాధ‌ప‌డుతున్న పేషెంట్ల‌పై బాగా ప‌ని చేయనుంది. క‌రోనా పేషెంట్ల‌కు ప్ర‌ధాన చికిత్స చేస్తూ అద‌నంగా ఈ ఔష‌ధాన్ని ఇస్తే వాళ్లు వేగంగా […]

క‌రోనాపై పోరుకు మ‌రో కీల‌క అస్త్రం

విధాత‌(న్యూఢిల్లీ): క‌రోనాపై పోరుకు మ‌రో కీల‌క అస్త్రం డాక్ట‌ర్ల‌కు అందుబాటులోకి రానుంది. ఇది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆర్గ‌నైజేష‌న్ (డీఆర్డీవో) సంధిస్తున్న అస్త్రం. డీఆర్డీవో త‌యారు చేసిన 2-డియాక్సీ-డీ-గ్లూకోజ్ (2-డీజీ) ఔష‌ధ అత్య‌వ‌స‌ర వినియోగానికి డ్ర‌గ్ కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమ‌తి ఇచ్చింది.

ఇది స్వ‌ల్ప నుంచి మోస్త‌రు క‌రోనాతో బాధ‌ప‌డుతున్న పేషెంట్ల‌పై బాగా ప‌ని చేయనుంది. క‌రోనా పేషెంట్ల‌కు ప్ర‌ధాన చికిత్స చేస్తూ అద‌నంగా ఈ ఔష‌ధాన్ని ఇస్తే వాళ్లు వేగంగా కోలుకునే అవ‌కాశం ఉంటుంద‌ని డీఆర్డీవో ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది.

ఇది జెన‌రిక్ మాలిక్యూల్‌, గ్లూకోజ్ అన‌లాగ్ కావ‌డం వ‌ల్ల దీని ఉత్ప‌త్తి చాలా సులువ‌ని, పెద్ద మొత్తంలో అందుబాటులో ఉంటుంద‌ని ఆ సంస్థ తెలిపింది. ఇది వాడిన పేషెంట్ల‌లో చాలా మందికి ఆర్టీ-పీసీఆర్ టెస్ట్‌లో నెగ‌టివ్‌గా తేలిన‌ట్లు డీఆర్డీవో చెప్పింది. ఈ డ్ర‌గ్ పొడి రూపంలో ఉండి, సాచెట్‌ల‌లో వ‌స్తుంది. దీనిని నీళ్ల‌లో క‌లుపుకొని తాగితే చాలు. ఇది వైర‌స్ ఉన్న క‌ణాల్లోకి చేరి, దాని వృద్ధిని అడ్డుకుంటుంద‌ని డీఆర్డీవో తెలిపింది.