200 కోట్ల దోపిడీ కేసులో నటి లీనా పాల్ అరెస్ట్
విధాత: వ్యాపారవేత్త భార్య నుంచి 200 కోట్లు దోపిడీకి పాల్పడిన, 21 కేసుల్లో నిందితుడైన ప్రియుడు సుకేశ్ చంద్రశేఖర్‌కు సహాయం చేసినందుకుగాను నటి లీనా పాల్‌ను ఢిల్లీ పోలీసులు(ఆర్థిక నేరాల విభాగం) ఆదివారం అరెస్టు చేశారు. నిందితులపై కఠినమైన మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ (MCOCA) చట్టాన్ని పోలీసులు ప్రయోగించారని, ఈ విషయంపై తదుపరి దర్యాప్తు జరుగుతోందని ఒక సీనియర్ పోలీసు అధికారి పిటిఐకి తెలిపారు. ఫోర్టిస్ హెల్త్‌కేర్ మాజీ ప్రమోటర్ శివిందర్ మోహన్ సింగ్ […]

విధాత: వ్యాపారవేత్త భార్య నుంచి 200 కోట్లు దోపిడీకి పాల్పడిన, 21 కేసుల్లో నిందితుడైన ప్రియుడు సుకేశ్ చంద్రశేఖర్‌కు సహాయం చేసినందుకుగాను నటి లీనా పాల్‌ను ఢిల్లీ పోలీసులు(ఆర్థిక నేరాల విభాగం) ఆదివారం అరెస్టు చేశారు.
నిందితులపై కఠినమైన మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ (MCOCA) చట్టాన్ని పోలీసులు ప్రయోగించారని, ఈ విషయంపై తదుపరి దర్యాప్తు జరుగుతోందని ఒక సీనియర్ పోలీసు అధికారి పిటిఐకి తెలిపారు. ఫోర్టిస్ హెల్త్‌కేర్ మాజీ ప్రమోటర్ శివిందర్ మోహన్ సింగ్ భార్య అదితి సింగ్‌ను మోసం చేయడంలో లీనాపాల్ చంద్రశేఖర్‌కు సహాయం చేశారన్నది ప్రధాన అభియోగం.
జైలులో ఉన్న తన భర్తకు బెయిల్ ఇవ్వడానికి సహాయం చేస్తానని గత ఏడాది జూన్‌లో న్యాయ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారిగా చెప్పుకున్న ఒక వ్యక్తి తన వద్దకు వచ్చి 200 కోట్ల రూపాయలు తీసుకెళ్లినట్లు సింగ్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆగస్టు 7 న ఎఫ్ఐఆర్ నమోదు అయింది. రెలిగేర్ ఫిన్వెస్ట్ లిమిటెడ్ (RFL) లో జరిగిన నిధుల దుర్వినియోగానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో శివిందర్ సింగ్ 2019 లో అరెస్టయ్యాడు.పోలీసుల కధనం ప్రకారం, ఎన్నికల కమిషన్ పేరు చెప్పి లంచం అడిగిన కేసుతో సహా 21 కేసుల్లో నిందితుడైన చంద్రశేఖర్ శివిందర్ భార్య సింగ్‌కు కాల్ చేసి న్యాయ మంత్రిత్వశాఖ అధికారిగా చెప్పుకున్నారని, అతన్ని ఆగస్టులోనే అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
సంఘటన జరిగిన సమయంలో, చంద్రశేఖర్ ఢిల్లీలోని రోహిణి జైలులో ఉన్నాడు. జైలు నుండే దోపిడీ రాకెట్ నడుపుతున్నాడు. చంద్రశేఖర్‌కు సహాయం చేసేందుకు అతడి కోసం జైలు వెలుపల నుండి కార్యకలాపాలు నిర్వహిస్తున్న అతని ఇద్దరు సహచరులను, రోహిణి జైలులోని ఇద్దరు సీనియర్ అధికారులను పోలీసులు అరెస్టు చేశారు.విచారణ సమయంలో, కానాట్ ప్లేస్‌లోని ఒక బ్యాంక్ మేనేజర్, అతని ఇద్దరు సహచరులు ఈ లావాదేవీలలో పాల్గొన్నారని పోలీసులు కనుగొన్నారని, ఆ తర్వాత ముగ్గురుని అరెస్టు చేసినట్లు ఒక సీనియర్ అధికారి తెలిపారు.
లీనా పాల్‌కు హైదరాబాద్ కేసుతోనూ సంబంధం
ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన నటి లీనా పాల్‌కు హైదరాబాద్ కేసులతోనూ సంబంధం ఉంది.
టిడిపి మాజీ ఎంపి రాయపాటి సాంబశివరావు బ్యాంకు మోసానికి సంబంధించి సిబిఐ కేసు నమోదు చేసింది. జనవరి 2020లో హైదరాబాద్‌లోని రాయపాటి ఇంట్లో సిబిఐ దాడులు జరిగిన కొన్ని రోజుల తరువాత ఇద్దరు వ్యక్తులు రాయపాటిని కలిసి సిబిఐ కేసులు మాఫీ చేయడానికి లంచం అడిగారు. ఈ కేసులోహైదరాబాద్‌కు చెందిన వైఎస్ మణివర్ధన్ రెడ్డి, మధురైకి చెందిన సెల్వం రామరాజ్ అనే ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ కేసులో సిబిఐ లీనాపాల్‌పై లుకౌట్ నోటీసు జారీ చేసింది. ఆమె పాత్రపై కూడా అభియోగాలు నమోదు చేసింది. కానీ ఇన్నాళ్లు ఆమెను పట్టుకోలేకపోయింది. సుకేష్ చంద్రశేఖర్, అతని ఆర్థిక నేరాల్లో భాగస్వామి అయిన లీనాపాల్ స్కెచ్ ప్రకారమే మణివర్దన్‌రెడ్డి, సెల్వంలు రాయపాటిని డబ్బులు డిమాండ్ చేసినట్లు విచారణలో తేలింది.