గురువారం తిరుమలకి రానున్న సీజేఐ రమణ

విధాత: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ శ్రీవారి దర్శనార్థం గురువారం తిరుమలకు రానున్నారు. మధ్యాహ్నం తిరుపతికి చేరుకునే ఆయన తిరుచానూరుకు వెళ్తారు. అక్కడ పద్మావతి అమ్మవారిని దర్శించుకుని తిరుమలకు చేరుకుంటారు. శుక్రవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆలయంలోకి వెళ్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకోన్నారు. ఎన్వీ రమణతో పాటు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ హిమా కోహ్లీ, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ లలిత […]

గురువారం తిరుమలకి రానున్న సీజేఐ రమణ

విధాత: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ శ్రీవారి దర్శనార్థం గురువారం తిరుమలకు రానున్నారు. మధ్యాహ్నం తిరుపతికి చేరుకునే ఆయన తిరుచానూరుకు వెళ్తారు. అక్కడ పద్మావతి అమ్మవారిని దర్శించుకుని తిరుమలకు చేరుకుంటారు. శుక్రవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆలయంలోకి వెళ్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకోన్నారు. ఎన్వీ రమణతో పాటు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ హిమా కోహ్లీ, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ లలిత కూడా తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకోన్నారు. ఏపీ హైకోర్టు సీజేగా బాధ్యతలు తీసుకున్న ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా తొలిసారిగా తిరుమలకు రానున్నారు.