పూర్తైన దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసు విచారణ
విధాత,దిల్లీ: సుప్రీంకోర్టులో దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసు విచారణ జరిగింది. ఈ సందర్భంగా.. విచారణ కమిటీ నివేదిక దాఖలుకు మరో ఆరు నెలలు సమయం కావాలని సుప్రీం ధర్మాసనాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది. పదే పదే సమయం ఎందుకు కోరుతున్నారని సీజేఐ ధర్మాసనం ప్రశ్నించింది. ఇప్పటికే 170 మందిని ప్రశ్నించారు.. ఇంకా ఎందరిని ప్రశ్నించాలి? అని సీజేఐ ఎన్.వి.రమణ వ్యాఖ్యానించారు.