కరోనా ఎఫెక్ట్.. ఎవరెస్ట్ ఉత్తర భాగంపై చైనా నిఘా
బీజింగ్: కరోనా మహమ్మారి ప్రపంచంలోని అతి ఎత్తయిన పర్వతాన్నీ వదల్లేదు. మౌంట్ ఎవరెస్ట్‌ని అధిరోహించడానికి వచ్చిన పర్వతారోహకులకూ వైరస్ సోకింది. ఇప్పటి వరకు ఎవరెస్ట్ బేస్‌క్యాంప్‌లో ఉన్న 30 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో తాము సృష్టించిన ఈ విపత్తు మళ్లీ తమ వైపు రాకుండా ఉండేందుకు పక్కనే ఉన్న చైనా అప్రమత్తమైంది. ఎవరెస్ట్ నేపాల్‌లో ఉన్నా.. దాని ఉత్తర భాగం మాత్రం చైనా ఆధీనంలో ఉంది. ఆ వైపు నుంచి పర్వతారోహకులు ఎవరెస్ట్ శిఖరాన్ని […]

బీజింగ్: కరోనా మహమ్మారి ప్రపంచంలోని అతి ఎత్తయిన పర్వతాన్నీ వదల్లేదు. మౌంట్ ఎవరెస్ట్‌ని అధిరోహించడానికి వచ్చిన పర్వతారోహకులకూ వైరస్ సోకింది. ఇప్పటి వరకు ఎవరెస్ట్ బేస్‌క్యాంప్‌లో ఉన్న 30 మంది కరోనా బారిన పడ్డారు.
దీంతో తాము సృష్టించిన ఈ విపత్తు మళ్లీ తమ వైపు రాకుండా ఉండేందుకు పక్కనే ఉన్న చైనా అప్రమత్తమైంది. ఎవరెస్ట్ నేపాల్‌లో ఉన్నా.. దాని ఉత్తర భాగం మాత్రం చైనా ఆధీనంలో ఉంది. ఆ వైపు నుంచి పర్వతారోహకులు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహిస్తారు. దీంతో తమ వైపు వారికి వైరస్ సోకకుండా కఠిన చర్యలు చేపడుతున్నట్లు ఆ దేశ అధికార మీడియా వెల్లడించింది.
ఎవరెస్ట్‌పై ప్రత్యేకంగా ఓ లైన్ ఏర్పాటు చేస్తోంది. తమ వైపు నుంచి ఈ శిఖరాన్ని ఎక్కిన వాళ్లు ఆ లైన్ దాటకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఉత్తర, దక్షిణ వైపు నుంచి ఎక్కేవ క్లైంబర్స్ మధ్య కాంటాక్ట్ ఉండకుండా తాము అత్యంత కఠినమైన వైరస్ నివారణ చర్యలు తీసుకుంటున్నట్లు టిబెట్ అధికారులు వెల్లడించారు. చైనా వైపు నుంచి వచ్చే వాళ్లు శిఖరంపైకి ఎక్కే ముందే దానిపై గైడ్లు ఓ ప్రత్యేక లైన్ ఏర్పాటు చేయనున్నారు. అయితే ఇది ఎలా చేస్తారన్న విషయం మాత్రం చెప్పలేదు.