ఒమ‌ర్ అబ్దుల్లాకు క‌రోనా నెగిటివ్.. భావోద్వేగ ట్వీట్‌

జ‌మ్మూకశ్మీర్ మాజీ ముఖ్య‌మంత్రి, నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ ఉపాధ్య‌క్షుడు ఒమ‌ర్ అబ్దుల్లాకు మంగ‌ళ‌వారం నిర్వ‌హించిన ప‌రీక్ష‌లో కొవిడ్ నెగిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. 18 రోజుల క్రితం ఆయ‌నకు కొవిడ్ పాజిటివ్‌ వ‌చ్చింది. ప‌రీక్ష‌లో త‌న‌కు నెగిటివ్ రిపోర్టు రావ‌డంతో ఆయ‌న తీవ్ర భావోధ్వేగానికి గుర‌య్యారు. త‌న‌కంటే అదృష్ట‌వంతులెవ్వ‌రూ లేరంటూ ట్విట్ చేశారు.“కాస్త జ‌లుబుతో ముక్కు మూసుకుపోవ‌డం మిన‌హా నాకు ఎలాంటి కొవిడ్ ల‌క్ష‌ణాలు లేవు. 9 రోజులుగా చాలా ఇబ్బంది ప‌డ్డా. అంద‌రి కంటే నేను చాలా అదృష్ట‌వంతుడిని, […]

ఒమ‌ర్ అబ్దుల్లాకు క‌రోనా నెగిటివ్.. భావోద్వేగ ట్వీట్‌

జ‌మ్మూకశ్మీర్ మాజీ ముఖ్య‌మంత్రి, నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ ఉపాధ్య‌క్షుడు ఒమ‌ర్ అబ్దుల్లాకు మంగ‌ళ‌వారం నిర్వ‌హించిన ప‌రీక్ష‌లో కొవిడ్ నెగిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. 18 రోజుల క్రితం ఆయ‌నకు కొవిడ్ పాజిటివ్‌ వ‌చ్చింది. ప‌రీక్ష‌లో త‌న‌కు నెగిటివ్ రిపోర్టు రావ‌డంతో ఆయ‌న తీవ్ర భావోధ్వేగానికి గుర‌య్యారు. త‌న‌కంటే అదృష్ట‌వంతులెవ్వ‌రూ లేరంటూ ట్విట్ చేశారు.
“కాస్త జ‌లుబుతో ముక్కు మూసుకుపోవ‌డం మిన‌హా నాకు ఎలాంటి కొవిడ్ ల‌క్ష‌ణాలు లేవు. 9 రోజులుగా చాలా ఇబ్బంది ప‌డ్డా. అంద‌రి కంటే నేను చాలా అదృష్ట‌వంతుడిని, భ‌గ‌వంతుడికి రుణ‌ప‌డి ఉంటా” అని ఆయ‌న ట్వీట్ చేశారు.