పుట్టుకొస్తున్న వేరియంట్లు.. బూస్టర్​ డోసు పడాల్సిందే

విధాత‌:కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్న క్రమంలో కొవిడ్​-19 వ్యాక్సిన్​ బూస్టర్​ డోసు అవసరమని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్​దీప్ గులేరియా స్పష్టం చేశారు.పిల్లలకు కరోనా టీకాపై భారత్​ బయోటెక్ చేపట్టిన క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు సెప్టెంబర్​ నాటికి వస్తాయని భావిస్తున్నట్లు తెలిపారు. కొత్తకొత్త కొవిడ్ వేరియంట్లు పుట్టుకొస్తున్న క్రమంలో ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్​దీప్ గులేరియా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏడాది చివరినాటికి బూస్టర్ డోసు అవసరమన్నారు. 2 నుంచి 18 ఏళ్ల లోపు వయస్సు వారి కోసం […]

పుట్టుకొస్తున్న వేరియంట్లు.. బూస్టర్​ డోసు పడాల్సిందే

విధాత‌:కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్న క్రమంలో కొవిడ్​-19 వ్యాక్సిన్​ బూస్టర్​ డోసు అవసరమని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్​దీప్ గులేరియా స్పష్టం చేశారు.పిల్లలకు కరోనా టీకాపై భారత్​ బయోటెక్ చేపట్టిన క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు సెప్టెంబర్​ నాటికి వస్తాయని భావిస్తున్నట్లు తెలిపారు. కొత్తకొత్త కొవిడ్ వేరియంట్లు పుట్టుకొస్తున్న క్రమంలో ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్​దీప్ గులేరియా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏడాది చివరినాటికి బూస్టర్ డోసు అవసరమన్నారు. 2 నుంచి 18 ఏళ్ల లోపు వయస్సు వారి కోసం భారత్​ బయోటెక్​ సంస్థ అభివృద్ధి చేస్తున్న కొవాగ్జిన్​ టీకా.. రెండో, మూడో దశ క్లినికల్​ ట్రయల్స్​​ సమాచారం సెప్టెంబర్​ నాటికి వస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. “వ్యాక్సిన్​ తీసుకున్న తర్వాత క్రమంగా రోగనిరోధక శక్తి తగ్గుతూ వస్తుంది. అందువల్ల భవిష్యత్తులో వచ్చే అన్ని రకాల వేరియంట్లను ఎదుర్కొనేందుకు మనకు బూస్టర్ డోసు అవసరం. బూస్టర్​ డోసు వల్ల సామర్థ్యం, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బూస్టర్​ డోసుపై క్లినికల్ ట్రయల్స్ ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. ఈ ఏడాది చివరి నాటికి మనం బూస్టర్ డోసు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ.. ప్రజలందరికీ వ్యాక్సినేషన్​ పూర్తయినప్పుడే అది సాధ్యం.” అని డాక్టర్ రణ్​దీప్ గులేరియా అన్నారు.

సెప్టెంబర్​లో ఫలితాలు..

భారత్​ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్​ టీకా.. పిల్లలకు ఇవ్వటంపై క్లినికల్​ ట్రయల్స్ జరుగుతున్నాయని గులేరియా తెలిపారు. సెప్టెంబర్ నాటికి ఫలితాలు వెలువడతాయన్నారు.”పిల్లలకు కొవిడ్​-19 వ్యాక్సిన్​లు రానున్నాయి. ఇప్పటికే క్లినికల్​ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. భారత్​ బయోటెక్ పరీక్షలు తుదిదశలో ఉన్నాయి. జైడస్‌ క్యాడిలా తయారు చేసిన టీకా చిన్నారులపై ప్రయోగాలు పూర్తయ్యాయి. టీకా వినియోగ అనుమతి కోసం డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ)కు దరఖాస్తు చేసుకుంది.” అని డాక్టర్ రణ్​దీప్ గులేరియా అన్నారు.ఫైజర్​, మోడెర్నా టీకాలను భారత్​లోకి తీసుకొచ్చేందుకు కేంద్రం.. ఆయా కంపెనీలతో చర్చలు జరుపుతోందన్నారు. ఇతర దేశాలు ఈ టీకాలను బుకింగ్ చేసుకున్నందువల్ల.. వ్యాక్సిన్ డోసుల లభ్యతకు సమయం పట్టొచ్చని వివరించారు.