ఇలాగైతే పర్యవేక్షణకు సుప్రీం ప్రత్యేక ధర్మాసనం

విధాత:పెండింగ్‌ కేసులపై వివరాలు సమగ్రంగా లేవు.తొలుత కేంద్రం చిత్తశుద్ధితో ఉందనుకున్నా.కానీ… ఆ దిశగా చర్యలు కనిపించడంలేదు.నేతలపై క్రిమినల్‌ కేసుల ఎత్తివేత కుదరదు.హైకోర్టుల అనుమతి తీసుకోవాల్సిందే.ప్రత్యేక కోర్టు జడ్జిల బదిలీ ఉండదు.వివరాల సమర్పణకు 2 వారాలు గడువు.చీఫ్‌ జస్టిస్‌ రమణ ధర్మాసనం కీలక ఆదేశాలు. ఇంకా నేర అభ్యర్థులేనా? ‘ప్రక్షాళన’ చట్టసభల తక్షణ కర్తవ్యం.‘క్రిమినల్‌’ వివరాలివ్వని పార్టీలకు జరిమానా అభ్యర్థిని ఖరారుచేసిన 48 గంటల్లోనేరచరిత్రను బహిర్గతం చేయాలి.ఎన్నికల కమిషన్‌ ఓ యాప్‌ రూపొందించాలి.నేరచరితుల వివరాలు పొందుపరచాలి సుప్రీం ధర్మాసనం […]

ఇలాగైతే పర్యవేక్షణకు సుప్రీం ప్రత్యేక ధర్మాసనం

విధాత:పెండింగ్‌ కేసులపై వివరాలు సమగ్రంగా లేవు.తొలుత కేంద్రం చిత్తశుద్ధితో ఉందనుకున్నా.కానీ… ఆ దిశగా చర్యలు కనిపించడంలేదు.నేతలపై క్రిమినల్‌ కేసుల ఎత్తివేత కుదరదు.హైకోర్టుల అనుమతి తీసుకోవాల్సిందే.ప్రత్యేక కోర్టు జడ్జిల బదిలీ ఉండదు.వివరాల సమర్పణకు 2 వారాలు గడువు.చీఫ్‌ జస్టిస్‌ రమణ ధర్మాసనం కీలక ఆదేశాలు.

ఇంకా నేర అభ్యర్థులేనా?

‘ప్రక్షాళన’ చట్టసభల తక్షణ కర్తవ్యం.‘క్రిమినల్‌’ వివరాలివ్వని పార్టీలకు జరిమానా అభ్యర్థిని ఖరారుచేసిన 48 గంటల్లో
నేరచరిత్రను బహిర్గతం చేయాలి.ఎన్నికల కమిషన్‌ ఓ యాప్‌ రూపొందించాలి.నేరచరితుల వివరాలు పొందుపరచాలి

సుప్రీం ధర్మాసనం కీలక తీర్పు

స్వచ్ఛ రాజకీయాల దిశగా భారత సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. కలగాపులగంగా కలిసిపోయిన ‘నేర-రాజకీయాల’ను ప్రక్షాళన చేయాల్సిన అవసరముందని స్పష్టం చేసింది. నేరమయ రాజకీయాలపై మంగళవారం ఒకేరోజు రెండు వేర్వేరు ధర్మాసనాలు కీలకమైన ఆదేశాలు జారీ చేశాయి. నేరచరితులను అభ్యర్థులుగా ఎంపిక చేయడం, అధికారంలోకి వచ్చాక వారిపై కేసులను ఎత్తివేయడం, ప్రజా ప్రతినిధులపై నమోదైన కేసుల వివరాలను సమగ్రంగా సమర్పించకపోవడం తదితర అంశాలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధిపైనా సందేహాలు వ్యక్తం చేసింది. ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల విచారణపై పర్యవేక్షణకు సుప్రీంకోర్టులోనే ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని తెలిపింది.